Ram Gopal Varma Tweet: ఒకప్పుడు ఇండియా గర్వించదగ్గే డైరెక్టర్..కానీ ఇప్పుడు బుర్రచెడిపోయి మనుగడ కోసం సంబంధం లేని విషయాల్లో దూరి కాంట్రవర్సీలు చేసే స్థాయికి దిగజారిపొయ్యాడు..అతను పేరు కూడా చెప్పక్కర్లేదు..ఈ మాత్రం పరిచయం ఇస్తే అతను రామ్ గోపాల్ వర్మ అని చాలా తేలికగా చిన్న పిల్లాడు కూడా కనిపెట్టేయగలడు..సోషల్ మీడియా లో ఈయన పెట్టె ట్వీట్స్ ని సీరియస్ గా తీసుకోవడం జనాలు ఎప్పుడో మానేశారు..రీసెంట్ టైం లో అతను పెట్టిన ట్వీట్స్ వంద రీట్వీట్లు వస్తే ఎక్కువ.

తన ట్విట్టర్ హ్యాండిల్ కి రీచ్ తగ్గిపోయిందనేమో తెలీదు కానీ రీసెంట్ గా అతను పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో పెద్ద చర్చ కి దారితీసింది..ఇటీవలే ఆయన ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియచేసాడు అట..అయితే రామ్ గోపాల్ వర్మ ని చూడగానే బలి ఇచ్చేముందు పొట్టేలుకి దండవేసినట్టు నాకు ఎందుకు దండ వేశారని సెటైరికల్ గా ఒక ఫోటో పెట్టాడు.
ఈ ఫోటో పై నెటిజెన్స్ చాలా ఫన్నీ రియాక్షన్స్ కామెంట్ సెక్షన్ లో పెట్టారు..దాసరి కిరణ్ త్వరలో రామ్ గోపాల్ వర్మ తో వ్యూహం అనే సినిమా తియ్యబోతున్నాడు..ఈ చిత్రం ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను వివరిస్తూ వై ఎస్ జగన్ కి అనుకూలంగా మరియు పవన్ కళ్యాణ్ , చంద్ర బాబు నాయుడికి వ్యతిరేకంగా చిత్రీకరయించబోతున్నాడు..దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఆయన అధికారిక ప్రకటన కూడా చేసాడు..ఈ ప్రకటన చేసే ముందు ఆయన అదే రోజు ముఖ్యమంత్రి జగన్ తో తాడేపల్లి లో సుమారు గంటసేపు భేటీ అయ్యారు.

జగన్ కోరిక మేరకే ఈ సినిమా ఆయనకీ అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా జనాల్లోకి బాగా వెళ్లే విధంగా ఈ స్క్రిప్ట్ ని తయారు చేస్తున్నాడట రామ్ గోపాల్ వర్మ..ఇక రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా తీస్తే ‘కోడి కత్తి’ అనే పేరు తో మేము కూడా ఒక సినిమా చేస్తామంటూ జనసేన పార్టీ వాళ్ళు సవాలు విసిరారు..రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం ఎన్ని వివాదాలకు తెరలేపుతుందో చూడాలి.