Homeఎంటర్టైన్మెంట్RGV vs VH: వీహెచ్‌ను ఆటాడుకుంటున్న ఆర్జీవీ..!

RGV vs VH: వీహెచ్‌ను ఆటాడుకుంటున్న ఆర్జీవీ..!

RGV vs VH
RGV vs VH

RGV vs VH: ఆర్జీవీ.. పరిచయం అక్కరలేని పేరు.. వివాదాలకు కేరాఫ్‌ ఆయనే. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు.. కాదు కాదు ఆర్జీవీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అని కొందరు కామెంట్స్‌ చేస్తుంటారు. ఎప్పుడూ వార్తల్లో నిలవాలని తరచూ వివాదాలను క్రియేట్‌ చేసుకుంటారు కూడా. వివాదాస్పద సినిమాలు తీయడంతోపాటు, వివాదాస్పద వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారు. ఇక మీటింగ్‌లకు వెళ్లినప్పడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నివడానికి ఇష్టపడతారు. పచ్చిగా చెప్పాలంటే.. వివాదాన్నే ఆర్జీవీ ఇష్టపడతారు. అయితే ఆర్జీవీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపనేంటో తను చేసుకుంటు పోతుంటాడు. కొన్ని రోజుల క్రితం అంబర్‌ పేట్‌ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్‌ కుటుంబం తరపున పోరాడి ప్రభుత్వం తరపునుంచి 8 లక్షల రూపాయలని అందించాడు. ఇది కేవలం వర్మ పోరాటం మూలంగానే వచ్చాయి అనడంతో అతిశయోక్తిలేదు.

నాగార్జున యూనివర్సిటీలో..
ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకాడమిక్‌ ఎగ్జిబిషన్‌ 2023 వేడుకకు ఆర్జీవీ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ ఎగ్జిబిషన్‌ లో వర్మ మాట్లాడుతూ..‘మీకు నచ్చింది తినండి, తాగండి లైఫ్‌ ను ఎంజాయ్‌ చేయండి. పక్కొడి గురించి ఆలోచించోద్దు. ఇక నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే.. అక్కడ ఏం లేకపోతే ఎలా? అందుకే అక్కడికి వెళ్లి బాధపడటం కంటే ఇక్కడే అన్ని అనుభవిస్తున్నా. అదీకాక స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడే ఎంజాయ్‌ చేయాలి’ అంటూ స్టూడెంట్స్‌కు ఉచిత సలహాలు ఇచ్చాడు వర్మ. రంభ, ఊర్వశి, మేనకలతో తిరిగినప్పుడే మోక్షం లభిస్తుందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు ఆర్జీవీ. ఇక కొత్త వైరస్‌ వచ్చి తాను తప్ప మిగతా మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు మహిళలందరికి నేనే దిక్కు అవుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అంతా షాక్‌..
వర్మ మాటలకు అక్కడున్న మహిళా లెక్చరర్లు అంతా షాక్‌ తిన్నారు. నేను బ్రెయిన్‌ ఉన్న జంతువును అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ఇక ఆర్జీవీ మాటలను తాను కూడా సమర్థిస్తున్నాను అంటూనే అతడికి ఆస్కార్‌ అవార్డు ఇవ్వడం కూడా తక్కువే అంటూ యూనివర్సిటీ వీసీ ఆర్జీవీకి మద్దతుపలికాడు. అయితే వర్మ మాట్లాడుతున్నంత సేపు స్టూడెంట్స్‌ గట్టిగా అరుస్తూ.. ఈలలు వేస్తూ.. రెచ్చిపోయారు.

ఆర్జీవీ వ్యాఖ్యలపై వీహెచ్‌ ఫైర్‌..
రామ్‌గోపాల్‌ వర్మ నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఫైర్‌ అయ్యారు. ఆర్జీవీని అరెస్ట్‌ చేయాలని, జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు. ఆర్జీవీపై కేసు పెట్టేవరకు ఆందోళన చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో మహిళలు తాము ఆందోళన చేయకుంటే బాగుండదనుకున్నారు. ఉద్యమాలు చేశారు. ఆర్జీవీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

RGV vs VH
RGV vs VH

వివాదంపై మరోవివాదం..
ఒక వివాదంపై ఆందోళనలు కొనసాగుతుండగానే ఆర్జీవీ మాత్రం వాటిని ఎంజాయ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత వీహెచ్, మహిళా సంఘాల నేతల ఆందోళనల వీడియోనూ ఎడిట్‌ చేసి.. తాను అమ్మాయిల మధ్య పవళించిన ఫొటో యాడ్‌చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. వీహెచ్‌ను ఆర్జీవీ వదిలిపెట్టేలా లేడుగా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version