https://oktelugu.com/

Upasana: ఆ వారం జరిగింది మరిచిపోలేకపోతున్నా.. రాంచరణ్ భార్య ఉపాసన షాకింగ్ పోస్ట్

Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు.. వారి భార్యలు ఫేమస్సే. చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో భర్తలకు బదులు భార్యలు పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు. రాంచరణ్ కు తోడుగా మెగా స్టార్ కోడలిగా ఉపాసన చేసే సేవా అంతా ఇంతా కాదు. తాజాగా ఉపాసన అనారోగ్యం బారిన పడినట్లు తాజాగా ఆమె పోస్టును బట్టి అర్థమవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్ వైరల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2022 / 11:20 AM IST
    Follow us on

    Upasana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాదు.. వారి భార్యలు ఫేమస్సే. చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో భర్తలకు బదులు భార్యలు పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు. రాంచరణ్ కు తోడుగా మెగా స్టార్ కోడలిగా ఉపాసన చేసే సేవా అంతా ఇంతా కాదు. తాజాగా ఉపాసన అనారోగ్యం బారిన పడినట్లు తాజాగా ఆమె పోస్టును బట్టి అర్థమవుతోంది.

    Upasana

    ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. చెన్నైలోని తన గ్రాండ్ పేరెంట్స్ ను కలిసేందుకు కోవిడ్ టెస్ట్ చేసుకున్నానని.. ఈ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

    Also Read: Sarkaru Vaari Paata Twitter Review: సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

    ‘గత వారం టెస్ట్ లో కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్ నన్ను కేవలం పారాసిటమల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడమని’ సూచించారు. ఈ మహమ్మారి సోకడంతో చాలా మంది నీరసించిపోవడం.. ఆరోగ్యం క్షీణించడం.. ఒంటినొప్పులు వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ నాకు అలాంటి సమస్యలు ఏం కనిపించలేదని ఉపాసన తెలిపారు.

    మెంటల్ గా, ఫిజికల్ గా తాను బలంగా ఉన్నానని..అందుకే తనకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఉపాసన తెలిపింది. మళ్లీ వైరస్ విజృంభిస్తుందా? అంటే చెప్పలేనని.. కానీ మనం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అని ఉపాసన తెలిపింది.

    Upasana

    చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్ బయటపడిందని.. లేదంటే అసలు తెలిసేది కాదని ఉపాసన చెప్పుకొచ్చింది.

    గతంలో ఉసాపన భర్త రాంచరణ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బారిన పడి కోలుకున్నాడు.


    Recommended Videos


    Tags