
Rajamouli- NTR: ఎన్టీఆర్-రాజమౌళి అత్యంత సన్నిహితులు. పరిశ్రమలో ఒకేసారి ఎదిగిన హీరో అండ్ డైరెక్టర్. రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఎన్టీఆర్ పట్ల రాజమౌళి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. రాజమౌళి హీరో సెలక్షన్ చూస్తే నచ్చిన హీరోలతోనే పదే పదే సినిమాలు చేశారు. కొందరు స్టార్స్ ని ఆయన టచ్ చేయలేదు. ఇరవై ఏళ్ల కెరీర్లో రాజమౌళి 12 సినిమాలు తీస్తే వాటిలో నాలుగు చిత్రాలు ఎన్టీఆర్ తోనే చేశాడు. తర్వాత ప్రభాస్ తో మూడు, రామ్ చరణ్ తో రెండు చిత్రాలు చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్-రాజమౌళి మధ్య అనుబంధం ఎలాంటిదో.
Also Read: Janhvi Kapoor: అతిపెద్ద సమస్యలో జాన్వీ కపూర్… హీరో రానా హెల్ప్!
అయితే తొలిచూపులో ఎన్టీఆర్ మీద రాజమౌళికి దారుణమైన అభిప్రాయం కలిగిందట. కొన్ని సీరియల్స్ కి పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో దర్శకుడు అయ్యాడు. ఆ సినిమాకు హీరోగా మరొకర్ని ఆయన అనుకున్నాడట. అది కుదర్లేదు, దాంతో ఎన్టీఆర్ కి ఛాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కి అది రెండో చిత్రం. ఇంకా టీనేజ్ ముగియలేదు. సెట్స్ లో ఎన్టీఆర్ అవతారం చూసి రాజమౌళి షాక్ అయ్యాడట.
దర్శకుడిగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా మొదటి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడు ఏంటి బాబోయ్ అనుకున్నాడట. పొట్టిగా మీసం లేకుండా, బుడి బుడి అడుగుల ఎన్టీఆర్ ని చూసి బాగా నిరుత్సహ పడ్డాడట. అయితే కుంటి గుర్రంతో రేసు గెలిస్తే గొప్ప విషయం కదా, అనే ఆలోచన కలిగిన రాజమౌళి… ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. షూట్ మొదలయ్యాక తన అభిప్రాయం మారిపోయిందని, ఎన్టీఆర్ టాలెంట్, కమిట్మెంట్ కి స్టన్ అయ్యానని రాజమౌళి చెప్పారు.

రాజమౌళి చాలా కాలం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో అంత తక్కువ అభిప్రాయం ఉన్న హీరోని ఆయన ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ వేడుకలో హాజరయ్యేందుకు ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యారు. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ నెల రోజులుగా లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నారు.
Also Read: Venu Swamy Love Story: వేణు స్వామికి అంత పెద్ద లవ్ స్టోరీ ఉందా… ప్రియురాల్ని లేపుకుపోయి మరీ!
మరి ఒక హీరోని ఇంత అవమానించడం correct kadu @ssrajamouli
Second line ithe nakey badha vesindhi
కుంటి గుర్రం అని పోల్చాడు తాత 😢😢😢😢
మరి అంత చిన్న చూప #JrNtr anteyఅటువంటి Rajamouli చేత my hero అనిపించుకునవు అంటే great అన్న #RamCharan 🔥🔥🔥🔥#ManOfMassesRamCharan pic.twitter.com/E4sbQjfYRC
— captain_India ™ (@captain_india_R) March 5, 2023