Sidhu Moosewala Mother: ఒక్కగానొక్క కొడుకును ప్రత్యర్థులు చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. త్వరలో పెళ్లి చేసుకుంటాడు, కోడలితో ఇంట్లోకి అడుగు పెడతాడు. తనకు ఆడుకోవడానికి మనవళ్ళు, మనవరాళ్ళను ఇస్తాడని ఆ తల్లి భావించింది. కానీ ఆమె కోరుకున్నది ఒకటైతే, జరిగింది మరొకటి. కళ్ళముందే కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లి రోదించని రోజంటూ లేదు. కొడుకు జ్ఞాపకాలు మర్చిపోలేక.. ఆ రోజే తను ఒక నిర్ణయం తీసుకుంది. బహుశా ఈ భూ ప్రపంచం మీద ఏ తల్లి కూడా అటువంటి నిర్ణయం తీసుకొని ఉండదు. అలా ఆ రోజు ఆ మహిళ తీసుకున్న నిర్ణయం 58 ఏళ్ల వయసులో ఆమెను మళ్లీ తల్లిని చేసింది. ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన తన కొడుకుని ఆదివారం మళ్లీ తన ముందుకు తీసుకొచ్చింది.
పంజాబ్ ర్యాపర్, సింగర్ సిద్దు మూసే వాలా ను ప్రత్యర్థులు 2022లో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన తల్లిదండ్రులకు సిద్దు ఒక్కడే సంతానం. అతడు అలా హత్యకు గురి కావడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో ఆ దంపతులు మళ్లీ తమ కొడుకును చూసుకోవాలని భావించారు. ఫలితంగా 58 సంవత్సరాల వయసులో సిద్దు తల్లి చరణ్ సింగ్ మళ్ళీ గర్భం దాల్చేందుకు సిద్ధపడింది. ఐవీఎఫ్ ద్వారా ఆమె మళ్లీ గర్భం దాల్చిందనే అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ వీటిని సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్ తప్పు పట్టాడు. అవన్నీ పుకార్లని, వాటిని నమ్మొద్దని చెప్పాడు. కానీ ఆదివారం చరణ్ సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
చరణ్ సింగ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందనేదానికి సంకేతంగా బల్కౌర్ సింగ్ ఒక బాబును ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.బల్కౌర్ సింగ్ కూడా తను బాబు ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “శుభ్ దీప్ (సిద్ధూ అసలు పేరు) పైనుంచి నువ్వు అందించిన ఆశీస్సులతో నీ తమ్ముడు జన్మించాడు.. మీ అమ్మ, తమ్ముడు ఆరోగ్యంగా ఉన్నారు. నీ ప్రేమ మాపై ఎప్పుడూ ఇలాగే ప్రసరించాలి. నీ ప్రేమకు నా ధన్యవాదాలు” అంటూ బల్కౌర్ సింగ్ రాసుకొచ్చాడు.
బల్కౌర్ సింగ్ పోస్ట్ చేసిన ఫోటోలు చక్కర్లు కొడుతుండడంతో సిద్దు అభిమానులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దు మళ్ళీ పుట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు..కాగా, సిద్దు జీవిత చరిత్ర ఆధారంగా జూపిందర్ సింగ్ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. దానికి “హూ కిల్డ్ ముసేవాలా? ది స్పైరలింగ్ స్టోరీ ఆఫ్ వయోలెన్స్ పంజాబ్” పేరు పెట్టాడు. ఈ పుస్తకం ఇప్పటికీ పంజాబ్ లో మోస్ట్ సెల్లింగ్ జాబితాలో ఉంది. ఈ పుస్తకాల్లో జూపిందర్ సింగ్ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించాడు. కాగా, సిద్దు జ్ఞాపకాలు మర్చిపోలేక 58 ఏళ్ల వయసులో చరణ్ సింగ్ మళ్లీ తల్లి కావడం పట్ల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లి ప్రేమకు కొలమానం అంటూ ఉండదంటూ కొనియాడుతున్నారు.
Congratulations on the return of the great ♥️ #SidhuMooseWala #BalkaurSingh
A precious day for well wishers pic.twitter.com/VxfXKh4rhY— SR ⁶⁹ (@ultimate__d) March 17, 2024