
Puli Meka Review: టైటిల్: పులి మేక(వెబ్ సిరీస్)
విడుదల తేదీ: 2023-02-24
నటీనటులు : లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సుమన్, రాజా, స్పందన పల్లి, గోపరాజు రమణ
దర్శకుడు: కె చక్రవర్తి రెడ్డి
నిర్మాత: కోన వెంకట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్: జీ 5
సిల్వర్ స్క్రీన్ మీద పోరాడి పోరాడి అలసిపోయిన ఆది సాయి కుమార్ డిజిటల్ బాట పట్టారు. పులి మేక టైటిల్ తో వెబ్ సిరీస్ చేశారు. అయితే ఈ సిరీస్లో ప్రధాన పాత్ర లావణ్య త్రిపాఠిది. ఆమె పరిస్థితి కూడా సేమ్. వరుస ప్లాప్స్ తో ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. సినిమా ఆఫర్స్ రాకపోవడంతో డిజిటల్ సిరీస్లు ఒప్పుకుంటున్నారు. నిజానికి డిజిటల్ కంటెంట్ దే భవిష్యత్. సమంత, రాశి ఖన్నా, కాజల్, తమన్నా ఆల్రెడీ సిరీస్లు, సినిమాలు చేస్తున్నారు. మరి డిజిటల్ రంగమైనా ఆది-లావణ్యలకు కలిసొచ్చిందా..
కథ:
కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి) సిన్సియర్ అండ్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్. పలు క్లిష్టమైన కేసులను పరిష్కరించి డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటుంది. కిరణ్ ప్రభకు ఓ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ నారాయణ్ (సుమన్) నుండి కబురొస్తుంది. ఓ కేసు విషయమై అర్జెంటుగా రావాలని కాల్ చేస్తారు. హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న పోలీసుల మర్డర్స్ మిస్టరీ ఛేదించే బాధ్యత అప్పగిస్తాడు. ఈ కేసులో సహకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుడైన ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) ముందుకు వస్తాడు.
సీరియల్ కిల్లర్ మరింత ప్రమాదకరంగా తయారవుతాడు. అతడి టార్గెట్ కేవలం పోలీసులు కాదని, ర్యాండమ్ గా ఇతరులను కూడా చంపుతున్నాడని తెలుస్తుంది. మరి కిరణ్ ప్రభ ఈ కేసును చేధించిందా? ప్రభాకర్ శర్మ కుటుంబానికి సీరియల్ కిల్లర్ కి ఉన్న సంబంధం ఏమిటీ? అసలు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? అనేదే పులి మేక కథ…
విశ్లేషణ:
టైటిల్ తోనే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అవగాహన కల్పించారు. పోలీసులకు సీరియల్ కిల్లర్ కి మధ్య జరిగే మైండ్ గేమ్. ఇన్వెస్టిగేషన్ డ్రామా. పులి మేక కథలో ఆసక్తికరమైన వేట ఉందా అంటే… పూర్తిగా ఎస్ అని చెప్పలేం. కథలో సీరియస్ నెస్ ఎమోషన్ పాళ్ళు తగ్గాయి. క్రైమ్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లేనే ప్రాణం. ఎందుకంటే కథలన్నీ ఒకటే కాబట్టి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించాలి. అది చేయలేకపోతే డ్రామా రక్తికట్టదు. ఆ విషయంలో దర్శకుడు కె చక్రవర్తి రెడ్డి పర్లేదు అనిపించారు.

అయితే హోమ్లీ, సాఫ్ట్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న లావణ్య త్రిపాఠిని ఓ సీరియస్ కాప్ రోల్ కి ఎంచుకోవడం సాహసం. లావణ్య త్రిపాఠి ఎంత మాస్ యాటిట్యూడ్ ట్రై చేసినా సెట్ కాలేదు. ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయారనిపిస్తుంది. ఇక లాజిక్ లేని సన్నివేశాలు, సిల్లీ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ తో కూడిన సిరీస్ 6వ ఎపిసోడ్ నుండి కొంచెం పుంజుకుంది. 7,8వ ఎపిసోడ్స్ లో వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. ఆది సాయి కుమార్ ఆకట్టుకున్నారు.
చివరి మాట:
క్రైమ్ థ్రిల్లర్ డై హార్డ్ ఫ్యాన్స్ పులి మేక సిరీస్ ని కొంతమేర ఎంజాయ్ చేస్తారు. డీసెంట్ ట్విస్ట్స్, కొన్ని ఎంగేజింగ్ సీన్స్ తో నడిపించారు. చివరి ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. అయితే లాజిక్ లేని సీన్స్, పూర్ స్క్రీన్ ప్లే, లావణ్య త్రిపాఠికి సెట్ కానీ క్యారెక్టర్ సిరీస్ దెబ్బతీశాయి. టైం పాస్ గా ఓసారి ట్రై చేయవచ్చు.
రేటింగ్: 2.75/5