spot_img
Homeఎంటర్టైన్మెంట్PM Modi- RRR Movie Team: ట్రిపుల్‌ఆర్‌ టీంకు ప్రధాని మోడీ అభినందనలు

PM Modi- RRR Movie Team: ట్రిపుల్‌ఆర్‌ టీంకు ప్రధాని మోడీ అభినందనలు

PM Modi- RRR Movie Team
PM Modi- RRR Movie Team

PM Modi- RRR Movie Team: సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్‌ పురస్కారాన్ని ఆర్‌ ఆర్‌ ఆర్‌ అందుకుంది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు అవార్డ్‌ వరించింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటు.. నాటు విజయకేతనం ఎగరవేసింది.

అభినందించిన మోదీ..
‘నాటు.. నాటు..’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ట్రిపుల్‌ ఆర్‌ టీంకు అభినందనలు తెలిపారు. ఈ గౌరవం ప్రతి భారతతీయుడికి గర్వాకారణం అంటూ కొనియాడారు. ఇది దేశం గర్వించే రోజు అని పేర్కొన్నారు. సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్‌ఎస్‌.రాజమౌళితోపాటు పాటకు సంగీతం అందించిన కీరవాణికి, పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్‌ సిప్లిగంజ్, కాల భైరవను ప్రశంసించారు. ఈ పాటకు అద్భుతంగా నాట్యం చేసిన ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు సినిమా యూనిట్‌ను అభినందనల్లో ముంచెత్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతీ భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని మోదీ అభిప్రాయపడ్డారు.

PM Modi- RRR Movie Team
PM Modi- RRR Movie Team

గోల్డెన్‌ గ్లోబ్‌ వరించిన సమయంలోనూ..
నాటు.. నాటు పాటకు ఇటీవల గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా వచ్చింది. ఈ సందర్భంగా కూడా మోదీ స్పందించారు. భారతీయ చిత్రం పాటకు అంతర్జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. ఆస్కార్‌ కూడా రావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందాన్ని కూడా అభినందించారు.

దిగ్గజ సంగీత దర్శకులతో పోటీ
ప్రపంచవ్యాప్తంగా దిగ్జజ సినీ ప్రముఖులు రూపొందించిన ఆల్బమ్స్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని పాట పోటీ పడింది. లేడి గాగ పాడిన హోల్డ్‌ మై హ్యాండ్, రిహన్నా పడిన లిఫ్ట్‌ మీ అప్, మిట్‌ స్కీ పాడిన ఆప్లాజ్‌ పాటల సరసన నాటు నాటు నిలిచింది. ప్రపంచ స్థాయి దిగ్గజాల పాటతో పోటీ పడుతూ నాటు నాటు ఆస్కార్‌ కిరిటాన్ని సాధించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version