
Prema Entha Madhuram: సీరియల్స్ అంటే… అత్తా కోడళ్ళ మధ్య వైరం, అర్థంపర్థం లేని కథనం, ఏళ్లకు ఏళ్ళు సాగే ఎపిసోడ్లు… ఇదీ చాలదన్నట్టు ఆ పగలు, ప్రతీకారాలు అబ్బో ఆ చెత్త వర్ణించలేం. మన దగ్గర కథలు అయిపోయాయేమో… దర్శకులు ఏకంగా ఇతర రాష్ట్రా ల్లో క్లిక్ అయిన సీరియల్స్ మీద పడ్డారు..మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారట! అంటే ఆ పగలు, ప్రతీకారాల డోస్ పెంచుతారట! లేకపోతే తెలుగు ఆడపడుచులకు నచ్చదట! పగ, ప్రతీకారం ఉంటేనే నచ్చుతుందని ప్రేక్షకులు చెప్పారా?
ఇక ఇన్నాళ్ళూ మనం సినిమాలోనే లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్లు చూసేవాళ్ళం. ఘనత వహించిన దర్శకులు వాటిని సీరియల్స్ కు కూడా తీసుకొచ్చారు. జీ తెలుగులో “ప్రేమ ఎంత మధురం” అనే సీరియల్ వస్తోంది. ఇది గత మూడేళ్ళుగా నడుస్తోంది..ఇంకా ఎన్నాళ్ళు వస్తుందో తెలియదు. సినిమాల్లో బాహుబలి ఎంతటి బెంచ్ మార్క్ సృష్టించిందో.. సీరియల్స్ లోనూ ఆ కార్తీక దీపం అంతటి రికార్డ్స్ సృష్టించింది. ఇక ఇప్పుడు వస్తున్న సీరియల్స్ కూడా దాన్నే అనుసరిస్తున్నాయి. ఇక ఆ టీఆర్పీ రేటింగ్స్ కోసం నానా గడ్డీ కరుస్తున్నాయి. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో ప్రధాన పాత్రధారులు అను, ఆర్య. వీరిద్దరి ప్రేమ కథ ఎంతకూ ముడి పడదు.. ఆ దర్శకుడు కథను సాగదీస్తున్న తీరు అలా ఉంది మరి. ఏళ్లకు ఏళ్ళు సాగుతున్నా గొప్ప రేటింగ్స్ రావడం లేదు. దీంతో సీరియల్ దర్శకుడు సినిమా రూట్ ఎంచుకున్నాడు.

ఒక సీన్ క్రియేట్ చేసి.. ఇద్దరినీ షవర్ కింద జలకాలు ఆడించాడు. బహుశా ఇప్పటిదాకా వచ్చిన సీరియల్స్ లో ఇటువంటి సన్నివేషాలు లేవు. షవర్ నుంచి నీళ్లు పడుతుంటే అను, ఆర్య రెచ్చిపోయారు.. ఒకరిని ఒకరు స్పర్శించుకుంటూ స్పృశించి పోయారు. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు తెలుగు విడుదల చేసింది..ఇది చూసిన ప్రేక్షకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=R2q-mQeU5BY