Prabhas : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వంద కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్న పాన్ ఇండియన్ స్టార్స్ లో ఒకరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ కి చేరిపోయాడు..ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం వందల కోట్ల రూపాయిల వసూళ్లను సాధిస్తున్నాయి..ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు.

అలాంటి హీరో ప్రాపర్టీ ని పెట్టి ఒక ప్రైవేట్ బ్యాంకు లో 21 కోట్ల రూపాయలు అప్పు చేసాడు అంటే ఎవరైనా నమ్ముతారా..కానీ నమ్మాలి..ఎందుకంటే అది నిజం కాబట్టి..బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలు చేసాడు..బాహుబలి ఊపు లో వచ్చిన సినిమా కాబట్టి సాహూ బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజి గా నిలిచింది..కానీ రాధే శ్యామ్ సినిమా మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది..బయ్యర్స్ కి దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిలించిందని అంచనా.
ఈ రెండు సినిమాలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కాయి..ఈ బ్యానర్ మరెవరిదో కాదు..ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ మరియు ప్రభాస్ స్నేహితులది..రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరిగా ఆడకపోవడం తో బయ్యర్స్ కి నష్టాలను పూడ్చాల్సిన అవసరం వచ్చింది..అందుకోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్స్ లో 70 శాతం తిరిగి ఇచ్చేసాడు..అయితే ప్రస్తుతం ఆయనకీ ఏమి అవసరం వచ్చిందో ఏమిటో తెలీదు కానీ ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు లో సొంత ప్రాపర్టీ ని పెట్టి 21 కోట్ల రూపాయిలు అప్పు తీసుకున్నాడు..ప్రస్తుతం ఆయన చేస్తున్న ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
కానీ ఈ సినిమాలు పూర్తి అయితే కానీ రెమ్యూనరేషన్ చేతికి రాదు..ప్రభాస్ కాస్త గట్టిగా అడిగితే పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడరు..కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రభాస్ వ్యక్తిగతం గా ఈ లోన్ తీసుకున్నాడట..ఈ కాలం లో నిర్మాత శ్రేయస్సుని కోరుకునే ఇంత మంచి మనసు ఉన్న హీరోలు ఉండడం నిజంగా టాలీవుడ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి.