Prabhas-Maruti : జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ప్రభాస్ సెలక్షన్ సరిగా లేదని స్వయంగా ఫ్యాన్స్ వాపోతున్నారు. దర్శకుడు ఓం రౌత్ ప్రతిభపై ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. టీజర్ విడుదలతో పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఆదిపురుష్ టీజర్ ఉసూరుమనిపించింది. ఆదిపురుష్ విడుదలతో హ్యాట్రిక్ ప్లాప్ ఖాయమే అని ఫిక్స్ అయ్యారు. జనవరికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ డిలే అయ్యింది. మరో ఆరు నెలల వరకు విడుదలయ్యే సూచనలు లేవు. బడ్జెట్ కి ఓ వంద కోట్లు అదనంగా కేటాయించి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. సినిమాలో విషయం లేదని తేలిపోయాక పై పై మెరుగులు పని చేయవు.

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ పై ఆయన ఫ్యాన్స్ లో సేమ్ ఫీలింగ్. వరుసగా రెండు ప్లాప్ చిత్రాలు చేసిన మారుతితో మూవీ అవసరమా? ప్లీజ్ ఆలోచన మార్చుకోండని హితవు పలికారు. ప్రభాస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ఓ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇది పూర్తి స్థాయిలో జరగలేదట. అలాగే నిర్మాతగా ఉన్న దానయ్య ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. ఆయన నుండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టేకోవర్ చేసిందట. అయితే ప్రభాస్ ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటాడనే విషయంలో స్పష్టత లేదట.
ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ పూర్తి చేసినా ఇప్పట్లో పూర్తి అయ్యే సూచనలు లేవట. మధ్యలో ప్రభాస్ మనసు మారడంతో మారుతికి బిగ్ షాక్ తగిలిందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మారుతి ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఎవరో ఒక చిన్న హీరోతో మూవీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రభాస్ మూవీ ఆగిపోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున మొదలవుతుంది. అది ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది.
ఎటు చూసినా ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ డిలే అయితే దర్శకుడు భారీగా నష్టపోతాడు. ప్రాజెక్ట్ కే, సలార్ ప్రాజెక్ట్స్ మాత్రం ప్రభాస్ శ్రద్దగా పూర్తి చేస్తున్నాడు. ఫ్యాన్స్ లో ఈ రెండు ప్రాజెక్ట్స్ పై ఎక్కడలేని విశ్వాసం ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీపై మొదటి నుండి ఫ్యాన్స్ లో హైప్ ఉంది. ఇక ఒక్కో అప్డేట్ తో దర్శకుడు నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కె పై అంచనాలు పెంచేస్తున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ప్రభాస్ ఓ మూవీ ప్రకటించారు. దిల్ రాజు తాజాగా తన బ్యానర్ లో ఓ మూవీ ప్రకటించారు.