https://oktelugu.com/

Prabhas illness : అనారోగ్యంతోనే షూటింగ్స్ చేస్తున్న ప్రభాస్.. ఆందోళనలో అభిమానులు

Prabhas illness : పాన్ ఇండియా లెవెల్ ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ఏ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు.బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకున్న ప్రభాస్ పేరిట వేల కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుంది.ఎన్నో వేల కుటుంబాలకు పనులను కల్పిస్తాయి ఆయన సినిమాలు.మరో విశేషం ఏమిటంటే ప్రభాస్ ఒక్క ఫ్లాప్ సినిమా, నేటి తరం పాన్ ఇండియన్ స్టార్స్ గా చెప్పుకునే ఎంతోమంది స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2023 / 08:26 PM IST
    Follow us on

    Prabhas illness : పాన్ ఇండియా లెవెల్ ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ఏ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు.బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకున్న ప్రభాస్ పేరిట వేల కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుంది.ఎన్నో వేల కుటుంబాలకు పనులను కల్పిస్తాయి ఆయన సినిమాలు.మరో విశేషం ఏమిటంటే ప్రభాస్ ఒక్క ఫ్లాప్ సినిమా, నేటి తరం పాన్ ఇండియన్ స్టార్స్ గా చెప్పుకునే ఎంతోమంది స్టార్ హీరోల సూపర్ హిట్స్ తో సమానం అని చెప్పొచ్చు.

    అది నిజంగా ప్రూవ్ అయ్యింది కూడా.అలాంటిది ఆయనకీ ఇప్పుడు సరైన బ్లాక్ బస్టర్ పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ తో ఏ రేంజ్ లో చెడుగుడు ఆడుకుంటాడో ఊహించుకోవచ్చు.అందుకే ఫ్లాప్స్ పడిన ప్రభాస్ పై ఎన్ని కోట్లు పెట్టడానికైనా వెనకాడరు దర్శక నిర్మాతలు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు

    KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’, మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ K’, ఓం రౌత్ తో ‘ఆది పురుష్’ మరియు యంగ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా డీలక్స్’.వీటిల్లో ఆది పురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.మిగిలిన మూడు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు ప్రభాస్.దీనితో ఆయన పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడట.గత కొద్దిరోజుల క్రితమే ఆయనకీ విపరీతంగా జ్వరం రావడం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

    కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్తున్నా కూడా, తనని నమ్మి నిర్మాత వేల కోట్లు ఖర్చుపెడుతున్నాడు, వాళ్లకి ఎలాంటి నష్టం రాకూడదని షూటింగ్స్ కి అనారోగ్యం తోనే పాల్గొంటున్నాడు ప్రభాస్.మరోపక్క అభిమానులు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని తీవ్రమైన ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.సినిమాలు ఆలస్యమైనా పర్వాలేదు, ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కి చెప్తున్నారు ఫ్యాన్స్.