Prabhas fans vs Pawan fans : ఫ్యాన్ వార్స్ ఒక్కోసారి దారుణ పరిణామాలకు దారి తీస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమైంది. అత్తిలిలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఏలూరుకు చెందిన హరి కుమార్, కిషోర్ వృత్తిరీత్యా పెయింటర్స్. ఉపాధి కోసం అత్తిలి వెళ్లారు. ఓ వ్యక్తి ఇంటికి పెయింట్ వేసేందుకు హరి కుమార్, కిషోర్ పనికి వెళ్లారు. హరి కుమార్ ప్రభాస్ అభిమాని. ఇక కిషోర్ పవన్ కళ్యాణ్ అభిమాని.
హరి కుమార్ తన వాట్సప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియో పెట్టుకున్నాడు. అది కిషోర్ కి నచ్చలేదు. నువ్వు కూడా పవన్ అభిమానిగా మారాలి. పవన్ వీడియో స్టేటస్ లో పెట్టుకోవాలని వాదనకు దిగాడు. అందుకు హరి కుమార్ నిరాకరించారు. సరదాగా మొదలైన వీరి మాటల యుద్ధం కొట్టుకునే వరకు వెళ్ళింది. ఆవేశంలో హరి కుమార్ పక్కనే ఉన్న కర్రతో కిషోర్ తలపై కొట్టాడు. అలాగే రాయితో ముఖం మీద గట్టిగా మోదాడు.
తీవ్ర గాయాలపాలైన కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన తణుకు రూరల్ పోలీసులు హరి కుమార్ కోసం గాలిస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. ఫ్యాన్ వార్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం దారుణ పరిణామమని పలువురు వాపోతున్నారు. గతంలో కూడా ఎలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీఆర్ అభిమాని ఒకరు పవన్ కళ్యాణ్ అభిమానిని హత్య చేశాడు.
అప్పట్లో ఈ ఉదంతం కలకలం రేపింది. ఎన్టీఆర్ స్వయంగా ఏ ఘటనపై స్పందించారు. అభిమానం పేరుతో ఉన్మాదం పనికిరాదు. అలాంటి అభిమానులు నాకు అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు హీరోలు ఒక్కటే. వారందరూ బాగానే ఉంటారు. అభిమానులే కొట్టుకు ఛస్తుంటారు. ఈ మాట మహేష్ ఓ వేదికలో అన్నారు కూడా. కాబట్టి అభిమానులు తన కోపతాపాలు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి.