Adipurush Official Teaser: ఆదిపురుష్: ప్రభాస్ పరాక్రమం.. సైఫ్ కూర్రత్వం.. వెరిసి తెరపై ‘మహా అద్భుత’ దృశ్యకావ్యం

Adipurush Official Teaser : ఆదిపురుష్.. తెరపై రామాయణాన్ని కళ్లకు కట్టేందుకు దర్శకుడు ఓం రౌత్, హీరో ప్రభాస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. సినీ ప్రేమికులు దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఈ టీజర్ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను అయోధ్య వేదికగా చిత్రబృందం […]

Written By: NARESH, Updated On : October 2, 2022 8:04 pm
Follow us on

Adipurush Official Teaser : ఆదిపురుష్.. తెరపై రామాయణాన్ని కళ్లకు కట్టేందుకు దర్శకుడు ఓం రౌత్, హీరో ప్రభాస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. సినీ ప్రేమికులు దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఈ టీజర్ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను అయోధ్య వేదికగా చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.

1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ రామాయణాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. తొలుత నీటి అడుగున ఘోర తపస్సు చేస్తున్న శ్రీరాముడి లుక్ లో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఈ సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. రాక్షసులను బాణాలతో ప్రభాస్ చంపే సీన్ హైలెట్ గా చెప్పొచ్చు. నిలబడి ఓరగా బాణాలు విసురుతూ గ్రాఫిక్స్ వండర్ గా తీర్చిదిద్దారు.

ఇక లక్ష్మణుడుగా సన్నీసింగ్, హనుమాన్ పాత్రలో దేవదత్తనాగే పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ వీరత్వం తెరపై అద్భుతంగా కనిపిస్తోంది. పది తలలతో సైఫ్ అలీఖాన్ చూపించిన క్రూరత్వం అదిరిపోయింది.

చివర్లో సీతగా హీరోయిన్ గా కృతి సనన్ ఒక చెట్టు కింద ఊయల ఊగుతున్న దృశ్యం కన్నుల విందుగా ఉంది. చివర్లో లంకకు వెళుతున్న సీన్లు, లంకపై హనుమాన్ తో దాడికి సంబంధించిన దృశ్యాలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా చూస్తే ‘ఆదిపురుష్’ చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా తెరపైకి వస్తుందని అర్థమవుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతిసనన్, ప్రధాన పాత్రదారులు, టీ సీరిస్ పతాకంపై భూషణ్ కుమార్ సహా పలువురు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

ఈ అదిరిపోయే ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను కింద చూడొచ్చు..