Premi Vishwanath: తెలుగు సీరియళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ప్రతి ఇంట్లో రాత్రి అయిందంటే చాలు కార్తీక దీపం సీరియల్ ఉండాల్సిందే. అందరిలో అంతగా ఆసక్తి గొలుపుతున్న సీరియల్ గా గుర్తింపు పొందింది. మనవారు సీరియళ్లంటే పిచ్చెక్కిపోతారు. అవసరమైతే మొగున్ని అయినా పట్టించుకోరు. అంతలా సీరియల్ కు అట్రాక్ట్ అయిపోయారు. ఇందులో ఉండే పాత్రలకు దగ్గరయ్యారు. వారి నిజమైన పేర్ల కంటే సీరియల్ లో ఉండే పేర్లకే విలువ ఎక్కువగా ఉంది. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు అందరిలో నానుతుంటాయి.

వంటలక్క మన తెలుగమ్మాయి కాకపోయినా మనవారు ప్రేమిస్తున్నారు. ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఆమె విడుదల చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఎన్ని రోజులైనా తెలుగు మహిళలలు వంటలక్కను అభిమానిస్తూనే ఉంటారు. దీంతో గతంలో ఈ సీరియల్ లో వీరి పాత్రలు చంపేయడంతో మూడు నెలలు సీరియల్ రేటింగ్ పడిపోయింది. ఇక వారి పాత్రలు మళ్లీ ఎంటర్ చేయడంతో అందరు ఎగబడి చూస్తున్నారు.
కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజీ వేరు. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఉండటం విశేషం. మన కుటుంబాల్లో ఉన్న చాలా మంది ఆడవాళ్లు ఈ సీరియల్ కోసం ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో కార్తీకదీపం సీరియల్ అంటే అందరికి ఇష్టమే ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీక దీపం సీరియల్ పూర్తయింది. తరువాత సీక్వెల్ కూడా ప్రసారమైంది. అందులో వారి పాత్రలు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ ప్రేక్షకుల అభిరుచి మేరకు వారి పాత్రలు మళ్లీ పుట్టించి సీరియల్ ను కొనసాగిస్తున్నారు.

వంటలక్క తన భర్త పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆసక్తి గా చూస్తున్నారు. లైకులు, షేర్లు విపరీతంగా వస్తున్నాయి. ప్రేమి విశ్వనాథ్ భర్తపేరు వినీత్ భట్. ఆయన జ్యోతిష్యం చెబుతుంటారు. వంటలక్కకరియల్ పెయిర్ అంటూ అభిమానులు తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు. దీంతో వంటలక్కకు సామాజిక మాధ్యమాల్లో సైతం అభిమానులు ఎక్కువగానే ఉన్నారని వారి పోస్టులను బట్టి తెలుస్తోంది.