Unstoppable With Nbk Pawan Kalyan: అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన చిన్న టీజర్ ని నిన్న ఆహా మీడియా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నీ అయినా ఒక సంబరం లాగ చేస్తుంటారు ఫ్యాన్స్..సినిమాల టీజర్స్ మరియు ట్రైలర్స్ కి మాత్రమే కాదు.

ఇలాంటి ప్రోమోలకు కూడా ఆల్ టైం రికార్డ్స్ పెట్టడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టైల్..నిన్న విడుదలైన టీజర్ కి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డు పెట్టారు..గతం లో ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో కోసం ఫ్యాన్స్ పెట్టిన రికార్డు ని కేవలం అరగంట వ్యవధిలోనే దాటేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..ప్రభాస్ ఎపిసోడ్ టీజర్ కి లైఫ్ టైం వ్యూస్ మొత్తం కలిపి 70 లక్షల వ్యూస్ మరియు మూడు లక్షల లైక్స్ వచ్చాయి.
ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..కానీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ టీజర్ కి కేవలం అరగంట వ్యవధి లోనే 1 మిలియన్ వ్యూస్ మరియు లక్షకి పైగా లైక్స్ వచ్చాయి..చాలా మంది హీరోలకు టీజర్స్ కి కూడా ఈ స్థాయి లైక్స్ రావు..ఇక ట్విట్టర్ లో కూడా ఈ టీజర్ ట్వీట్ కి రికార్డు స్థాయి రీట్వీట్స్ మరియు లైక్స్ వచ్చాయి.

ట్వీట్ వేసిన నిమిషాల వ్యవధిలోనే పది వేలకు పైగా రీట్వీట్స్ మరియు 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి..ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో కి సంబంధించిన ట్వీట్ కి లైఫ్ టైం రీట్వీట్స్ కూడా ఈ రేంజ్ లో రాలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..మరి ఈ నెల 26 వ తారీఖున స్ట్రీమింగ్ కాబోతున్న ఎపిసోడ్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.