‘Seize the Ship’ Dialogue : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సొంత ప్రభుత్వం లో ఏ చిన్న అవకతవకలు జరిగినా ఆయన ఉపేక్షించట్లేదు. బహిరంగంగానే ప్రశ్నిస్తున్నాడు, అధికారులను నిలదీస్తున్నాడు, వాళ్ళ చేత పనులు కూడా వేగంగా చేయిస్తున్నాడు. ఆడపిల్లల రక్షణ విషయం లోనూ ఆయన హోమ్ మినిస్టర్ అనిత ని నిలదీసి ప్రశ్నించిన తీరుకి రాష్ట్రంలో అసభ్య పదాజాలం వాడిన ఎంతో మంది 48 గంటల్లో అరెస్ట్ చేయించిన ఘనత పవన్ కళ్యాణ్ దే. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఆయన నిన్న కాకినాడ పోర్టు కి వెళ్లి, అక్కడి జరుగుతున్నా రైస్ స్మగ్లింగ్ ని ఆపాడు. ముందు రోజు రాత్రి కలెక్టర్ వీటిని సీజ్ చేసినా కూడా, అధికారులతో మ్యానేజ్ చేయించి, షిప్ లో తరలిస్తున్న విషయం తెలుసుకొని ఆయన నేరుగా కాకినాడ పోర్ట్ కి విచ్చేశాడు.
ఆ తర్వాత పోర్టు అధికారులను నిలదీసి షిప్ ని సీజ్ చేసిన ఘటన సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించి చర్చ. అభిమానులు ‘సీజ్ ది షిప్’ అని పవన్ కళ్యాణ్ అన్న మాటలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేసారు. నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు ‘సీజ్ ది షిప్’ మీద రెండు లక్షలకు పైగా ట్విట్టర్ లో ట్వీట్స్ పడ్డాయి. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. ఎంతో మంది పెద్దవాళ్ళు చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాన్ని ఇంత ధైర్యంగా బయటపెట్టిన నాయకుడిని ఇప్పటి వరకు మేము చూడలేదంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యం ఆనుకుంటున్న ఇలాంటి ఘటనలను పవన్ కళ్యా నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తున్నాడు శబాష్ అంటూ కొనియాడుతున్నారు.
కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని పవన్ కళ్యాణ్ నిన్నటి కాకినాడ ఎపిసోడ్స్ కి జత చేస్తూ వందలకొద్దీ ఎడిటింగ్ వీడియోలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఈ రేంజ్ డ్యూటీ చేస్తే, ఇక సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఎన్ని అద్భుతాలు చేస్తాడో అని సోషల్ మీడియా అంతటా మాట్లాడుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి సంచలన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర తో పాటు, ఒక్క రోజులో కేంద్ర యూనియన్ మినిస్టర్స్ అందరిని కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నిధులను సమకూర్చడం వంటివి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇప్పుడు నిన్నటి కాకినాడ ఘటన కూడా ట్రెండింగ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
Seize the Ship, If any pressure comes from the central government, will see.
– #PawanKalyan#Janasena #Kakinada #AndhraPradesh #Tupaki pic.twitter.com/cNWvKPmm0P
— Tupaki (@tupaki_official) November 29, 2024