
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లో ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈమధ్యనే పూర్తి అయ్యినట్టు ఆ చిత్ర దర్శకుడు సముద్ర ఖని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. జులై 28 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన సినిమా షూటింగ్స్ మొత్తం హైదరాబాద్ లోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాలతో పాటుగా రాజకీయాలు కూడా సమాంతరంగా మైంటైన్ చేస్తున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు హైదరాబాద్ వదిలి బయటకి వెళ్లక తప్పేలా లేదు. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ తెరకెక్కబోతున్న #OG మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు డైరెక్టర్ సుజిత్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై కి వెళ్లి పలు లొకేషన్స్ ని చూసి వచ్చింది మూవీ టీం. ఏప్రిల్ నెల మొత్తం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. మే నెల నుండి పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు,ఆయన పాల్గొనే మొదటి షెడ్యూల్ ముంబై లోనే ఉంటుందట.
దాంతో సుమారు 6 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ ని దాటి బయటకి వెళ్తున్నాడని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 వ తారీఖు నుండి జరగబోతుంది. సుమారుగా పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరుగుతుందట, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 90 రోజుల డేట్స్ ని కేటాయించాడు.