Pawan Kalyan- Sujeeth Movie: సోషల్ మీడియా మొత్తం నిన్నటి నుండి పవన్ నామస్మరణ తో హోరెత్తిపోతుంది..ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే మరో పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ కి శ్రీకారం చుట్టాడు కాబట్టి..#RRR మూవీ ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా..సాహూ మరియు రన్ రాజా రన్ వంటి సినిమాలు తీసిన సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు..నిన్న ఎప్పుడైతే ఈ ప్రకటన అధికారికంగా వచ్చిందో అప్పటి నుండి సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ మ్యానియా తో ఊగిపోయింది..ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

తన తోటి స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ ముందుకి దూసుకుపోతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రీమేక్ సినిమాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ అనేక సందర్భాలలో సోషల్ మీడియా లో అసంతృప్తి వ్యక్తం చేసారు..కానీ ఇప్పుడు వరుసగా ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ పాన్ ఇండియన్ మూవీ తో పాటు , సుజీత్ తో భారీ యాక్షన్ మూవీ మరియు హరీష్ శంకర్ తో మరో మూవీ చేస్తుండడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
ఇక నిన్న ప్రకటించిన ‘పవన్ కళ్యాణ్ – సుజీత్’ మూవీ కాంబినేషన్ పై టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ట్వీట్లు వేస్తూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు..వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్స్ ఉన్నారు..వీరితో పాటు కుర్ర హీరోలు మంచు మనోజ్ , వరుణ్ సందేశ్ , సాయి ధరమ్ తేజ్ , అడవి శేష్ ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా సెలెబ్రిటీలందరూ క్యూ కడుతూ ఈ ప్రాజెక్ట్ పై తమకి ఉన్న కుతూహలంని చూపించారు.

కేవలం ఒక సినిమా ప్రకటన ఇంతతి ప్రకంపనలు గతం లో ఏ ప్రాజెక్ట్ కి కూడా మనం చూడలేదు..పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తే ఆడియన్స్ దగ్గర నుండి సెలెబ్రిటీల వరుకు ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహం చూపిస్తారు అనడానికి ఇదే ఉదాహరణ..వచ్చే ఏడాది లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాని 2023 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.