
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయ కార్యకలాపాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాడు ఆయన. నిన్నమొన్నటి వరకు షూటింగ్స్ లో ఊపిరి సలపనంతా బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కుటుంబం తో కలిసి విదేశాలకు చిన్న హాలిడే ట్రిప్ కోసం వెళ్ళాడు. ఈరోజు ఆయన విమానాశ్రయం లో తన భార్య పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ బుడి బుడి అడుగులతో పరుగులు తీస్తూ వెళ్లడాన్ని చూసిన అభిమానులు ‘ఈ బుడ్డోడు అప్పుడే అంత ఎదిగిపోయాడా’ అని ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ హాలిడే ట్రిప్ ఉండనుంది అని తెలుస్తుంది. మళ్ళీ ఆయన ఏప్రిల్ 5 వ తారీఖున ఇండియా కి తిరిగి రాబోతున్నాడు.
ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ఆయన హరీష్ శంకర్ తెరకెక్కించబోయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా వచ్చింది. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాసి, అల్ టైం టాప్ 2 గ్రాస్సర్ గా నిల్చింది.మళ్ళీ అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి.

ఏప్రిల్ 5 నుండి పది రోజులు విరామం లేకుండా కొనసాగనున్న ఈ మొదటి షెడ్యూల్ పూర్తైన వెంటనే హరి హర వీరమల్లు బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు. మళ్ళీ మే నెల నుండి OG మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్.ఇలా ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత క్షణ కాలం కోరిక తీరిక లేకుండా గడపనున్నాడు.