
Pawan Kalyan- Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’..పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే నెల 27 వ తారీఖు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ చిత్రం స్టోరీ లైన్ తో ఈ సినిమా స్క్రిప్ట్ ని డెవలప్ చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్.ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ప్రముఖ దర్శకుడు దశరధ్ కూడా ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ నుండి ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.కానీ రీ ఎంట్రీ తర్వాత ఆయన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్’ వంటి సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చాడు.ఇప్పుడు అభిమానులు కోరుకునే కమర్షియల్ సినిమా తియ్యబోతుండడం తో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించబోతుందని టాక్.ఈమధ్యనే డైరెక్టర్ హరీష్ శంకర్ ఆమె డేట్స్ కోసం వెళ్లి కలిశాడట.వచ్చే నెల మార్చ్ 27 వ తారీఖు నుండి ఆమె సెట్స్ లో సందడి చేయనుంది.మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో కేవలం శ్రీ లీల మాత్రమే కాదు, పూజా హెగ్డే కూడా హీరోయిన్ గా నటిస్తుందట.ప్రస్తుతం వీళ్లిద్దరు సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.మళ్ళీ వీళ్లిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించబోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.

ఇక శ్రీ లీల కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కుర్ర హీరోల నుండి టాప్ స్టార్స్ వరకు ఆమె వెంట పడుతున్నారు.ఎందుకంటే కేవలం ఆమెని చూసి కదిలే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు కాబట్టి.చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో శ్రీ లీల మేనియా టాలీవుడ్ లో ఎలా ఉండబోతుంది అనేది.