https://oktelugu.com/

Unstoppable NBK – Pawan : ‘అన్ స్టాపబుల్’ షో కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్.. సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ !

Unstoppable with NBK – Pawan :  ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 2 రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో దూసుకుపోతోంది.. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతోంది..మొదటి 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్న చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతున్నాయి.. ఇటీవలే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి ముఖ్య అతిథి గా హాజరయ్యాడు..షూటింగ్ కూడా ఈమధ్యనే జరిగింది.. దానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2022 / 07:52 PM IST
    Follow us on

    Unstoppable with NBK – Pawan :  ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 2 రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో దూసుకుపోతోంది.. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతోంది..మొదటి 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్న చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతున్నాయి.. ఇటీవలే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి ముఖ్య అతిథి గా హాజరయ్యాడు..షూటింగ్ కూడా ఈమధ్యనే జరిగింది.. దానికి సంబంధించిన చిన్న ప్రోమో గ్లిమ్స్ కూడా విడుదల చేసారు.

    ఎప్పుడెప్పుడు ఈ షో ప్రసారం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.. డిసెంబర్ 31 వ తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలిసింది.. ఇప్పుడు ప్రభాస్ తర్వాత మరో క్రేజీ స్టార్ హీరో డేట్స్ ని పట్టేసింది ఆహా టీం..ఆ స్టార్ మరెవరో కాదు..మన పవర్ స్టార్ పవన్ కల్యాణే..చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో చివరి ఎపిసోడ్ కి రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించేవి.

    పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్ షోస్ కి రావడం ఏమిటి..అదంతా కేవలం పుకారు మాత్రమే అని అందరూ అనుకున్నారు..చాలా రోజుల నుండి ఆహా టీం పవన్ డేట్స్ కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు.. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.. త్వరలోనే డేట్స్ చూసి చెప్తానని..షూటింగ్ సిద్ధం చేసుకోమని పవన్ కళ్యాణ్ ఆహా టీంకి చెప్పాడట.

    సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వూస్ ఇవ్వడం తప్ప, ఎప్పుడూ ఇలాంటి టాక్ షోస్ పై ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఇప్పుడు బాలయ్య బాబు షో కి రాబోతుండడం పెద్ద చర్చకి దారి తీసింది..పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన చిరకాల మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కాబోతున్నారట..ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది.