https://oktelugu.com/

Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ కి క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్ అభిమాని… కారణం ఏంటంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని ఫ్యాన్స్ ఫిక్సయి ఉన్నారు. అయితే వాళ్ళ అంచనాలను, ఊహాగానాలు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్స్ మార్చేసింది. నిమిషం నిడివి కలిగి ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అద్భుతం చేసింది. గ్లిమ్ప్స్ చూశాక ఇది తేరి రీమేక్ కాకపోవచ్చన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2023 / 08:43 PM IST
    Follow us on

    Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ అభిమాని క్షమాపణలు చెప్పారు. అతని పశ్చాత్తాపానికి హరీష్ శంకర్ స్పందించారు. రిప్లై ఇచ్చాడు. అసలు పవన్ అభిమాని హరీష్ శంకర్ కి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని పరిశీలిస్తే… హరీష్ శంకర్-పవన్ కాంబోపై ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉంది. గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పని చేయాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు అది సాకారమైంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించాక వరుసగా ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. వాటిలో హరీష్ శంకర్ మూవీ కూడా ఒకటి.

    భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఫ్యాన్స్ నుండి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. సడన్ గా మేకర్స్ మనసు మారింది. భవదీయుడు భగత్ సింగ్ కాదని వేరో ప్రాజెక్ట్ ప్రకటించారు. అది తమిళ హిట్ చిత్రం తేరి రీమేక్ అని ప్రచారం సాగింది. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. అందరికీ తెలిసిన తేరి మాకు వద్దు, భవదీయుడు భగత్ సింగ్ కావాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ మొదలుపెట్టారు.

    ఈ క్రమంలో కొందరు పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని టార్గెట్ చేశారు. ఆయనపై విరుచుకుపడ్డారు. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని ఫ్యాన్స్ ఫిక్సయి ఉన్నారు. అయితే వాళ్ళ అంచనాలను, ఊహాగానాలు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్స్ మార్చేసింది. నిమిషం నిడివి కలిగి ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అద్భుతం చేసింది. గ్లిమ్ప్స్ చూశాక ఇది తేరి రీమేక్ కాకపోవచ్చన్న అభిప్రాయానికి ఫ్యాన్స్ వచ్చారు.

    ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో వాళ్ళను ఓ రేంజ్ లో ఫిదా చేసింది. దీంతో గతంలో హరీష్ శంకర్ ని తిట్టినందుకు బాధపడుతున్నారు. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము. తిట్టినందుకు గిల్టీగా ఉంది. మమ్మల్ని క్షమించండి. దయచేసి బ్లాక్ చేసిన వాళ్ళను అన్ బ్లాక్ చేయాలని ఓ అభిమాని కోరారు. దానికి సమాధానంగా హరీష్… మనలో మనకు క్షమాపణలు అవసరం లేదు. సినిమా ఎంజాయ్ చేయండి. నేను క్రిటిసిజంని స్వాగతిస్తాను. బూతులు తిట్టిన వాళ్ళను మాత్రమే బ్లాక్ చేశానని, రిప్లై ఇచ్చారు. హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ అవుతుంది.

    https://twitter.com/harish2you/status/1657280374509273091?s=20