Walthair Veeraiah : ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ పాత్రని వదులుకున్న స్టార్ హీరో అతనేనా?

Walthair Veeraiah : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం..ఎక్కడ చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కిటకిటలాడిపోతున్నాయి.. మెగాస్టార్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి అడుగుపెడితే ఆయన బాక్స్ ఆఫీస్ డామినేషన్ ని ఎవ్వరూ కూడా తట్టుకోలేరని మరోసారి నిరూపించింది ఈ చిత్రం. ఆచార్య మరియు గాడ్ ఫాదర్ చిత్రాలతో డౌన్ ఫాల్ […]

Written By: NARESH, Updated On : January 14, 2023 10:17 pm
Follow us on

Walthair Veeraiah : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం..ఎక్కడ చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కిటకిటలాడిపోతున్నాయి.. మెగాస్టార్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి అడుగుపెడితే ఆయన బాక్స్ ఆఫీస్ డామినేషన్ ని ఎవ్వరూ కూడా తట్టుకోలేరని మరోసారి నిరూపించింది ఈ చిత్రం.

ఆచార్య మరియు గాడ్ ఫాదర్ చిత్రాలతో డౌన్ ఫాల్ ని చూసిన మెగాస్టార్ ని చూసి ఒక వర్గం భలే ఎంజాయ్ చేసింది.. కానీ ఇప్పుడు అదే వర్గానికి రాత్రులు నిద్రలు కూడా లేకుండా చేసింది ఈ చిత్రం..ఎక్కడ తమ వర్గానికి చెందిన హీరో సినిమాని దాటివేస్తుందో అని భయపడిన పచ్చ మీడియా చానెల్స్ తెల్లవారుజామునే డిజాస్టర్ రేటింగ్స్ తో తొక్కేయాలని చూసింది..కానీ మెగాస్టార్ వాళ్ళని తన సక్సెస్ తో చెప్పుతో కొట్టేలా చేసాడు.

ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవే..అందులో ఎలాంటి సందేహం లేదు..కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ మరో లెవెల్ కి వెళ్ళడానికి కారణం మాత్రం మాస్ మహారాజా రవితేజానే..విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ కెరీర్ లో ఆ రేంజ్ పవర్ ఫుల్ రోల్ పడింది ఈ సినిమాతోనే.. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశంలో రవితేజ నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించేసింది.. రవితేజ కెరీర్ లో ఇంత ఏడుపు రప్పించే సన్నివేశం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..  అయితే తొలుత ఈ పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట.

చిరంజీవికి ఈ సినిమాలో తమ్ముడి పాత్రతో ఎంతో అనుబంధం ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు బాగా రక్తికట్టిస్తాయి అనుకున్నారు.. కానీ మూవీలో ఆ పాత్ర చనిపోతుంది..  పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో, సినిమాకే రిస్క్ అని చిరంజీవి డైరెక్టర్ బాబీతో వద్దు అన్నాడట.. ఆ తర్వాత రవితేజని స్వయంగా ఆయనే సజెస్ట్ చేసాడట.. దాని ఫలితం ఏంటో ఈరోజు మనం చూస్తున్నాం.