
RRR Prem Rakshith : #RRR మూవీ కి నేడు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు లభించినందుకు గాను నేడు మన అందరం ఇలా సంబరాలు చేసుకోవడానికి ప్రధాన కారణం గా నిలిచినవారిలో ఒక్కరు ప్రేమ్ రక్షిత్ మాస్టర్.నిజమే రాజమౌళి విజన్ వల్లే ఇదంతా సాధ్యపడింది, కానీ ఆయన విజన్ కి తగట్టు గా హీరోలిద్దరి చేత అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ వేయించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి నూటికి నూరు మార్కులు వెయ్యాల్సిందే.
ఆస్కార్ రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొన్ని వ్యక్తిగత కారణాల చేత ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి వచ్చి తన ఆనందం ని పంచుకోలేకపోవం పై అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది.అయితే ఆత్మహత్య చేసుకునే స్థాయి నుండి, నేడు ఆస్కార్ అవార్డు గెలిచే రేంజ్ కి ఎదిగిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సుదీర్ఘ సినీ ప్రయాణం ఎంతో ఆదర్శప్రాయం.
ఇండస్ట్రీ లోకి రాకముందు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వ్యక్తిగత కారణాల వల్ల ఎంతో మానసిక వేదనకి గురయ్యాడు.ఒకానొక సమయం లో ఆయన ‘ఇక ఈ జీవితం చాలు’ అనుకోని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అలాంటి సమయం లో రాజమౌళి ఆయనకీ అండగా నిలిచాడు.తాను దర్శకత్వం వహిస్తున్న ఛత్రపతి సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు.ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవడం లో నూటికినూరుపాళ్లు చాలా చక్కగా వినియోగించుకున్నారు ప్రేమ్ రక్షిత్.ఛత్రపతి సినిమా తర్వాత నుండి రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతీ సినిమాకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మాత్రమే కొరియోగ్రఫీ చేస్తూ వచ్చాడు.
అలా ఆయన యమదొంగ సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించాడు.ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఎన్నో అద్భుతమైన స్టెప్పులను కంపోజ్ చేసి నేడు ఆస్కార్ రేంజ్ కి ఎదిగాడు.రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి.