Janhvi Kapoor- NTR: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా అరంగేట్రం చేసి 5 ఏళ్ళు దాటింది..ఒక్క సక్సెస్ కూడా ఆమె ఖాతాలో లేదు కానీ, యూత్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుది కాదు..ముఖ్యంగా సోషల్ మీడియా లో కుర్రకారులు జాన్వీ కపూర్ అంటే వెర్రెత్తిపోతారు..అందుకే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చెయ్యడానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తూనే ఉన్నారు..అయితే సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకు చాలా చులకన అని అందరూ అంటూ ఉంటారు.

జాన్వీ కపూర్ ప్రవర్తన కూడా సౌత్ సినిమాల పట్ల అలాగే ఉండేదట..ముఖ్యంగా ఆమె చెప్పే షరతులకు భయపడి ఆమెతో సినిమాలు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు..అయితే ఎట్టకేలకు ఆమె ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది..ఇందుకోసం నిర్మాతలు ఆమె నాలుగు కోట్ల రూపాయిల పారితోషికం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకి ఆమె పెడుతున్న షరతులను చూసి ఎన్టీఆర్ దగ్గర నుండి మూవీ యూనిట్ వరకు మొత్తం షాక్ కి గురయ్యారట..ఈ సినిమాలో ఆమె సన్నివేశాలకు సంబంధించి ఒక్కటి కూడా ఎడిటింగ్ లో తియ్యకూడదట..అంతే కాకుండా తనకి ఏ స్క్రిప్ట్ అయితే చెప్పారో..ఆ స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు ఉండకూడదని..ఉంటె మధ్యలోనే వదిలేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందట.

ఇవి ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని చెప్పిందట..నిర్మాతలు అందుకు ఒప్పుకున్న తర్వాతే అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేసిందట..ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇనాళ్ళు అవుతున్నా కూడా ఒక్క హిట్టు కూడా లేని జాన్వీ కపూర్ కి ఇంత బిల్డప్ అవసరమా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇస్తామని చెప్తూనే అతని సినిమాకి ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏంటో అంటూ జాన్వీ కపూర్ పై విరుచుకుపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఫిబ్రవరి నెల నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నామని అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.