Noah Schnapp: సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు జనాలు నార్మల్ గా చూడలేరు. మగ, ఆడ జాతులకు ఉన్న విలువ థర్డ్ జెండర్ కి ఉండదు. సమాజం వాళ్ళను చిన్న చూపుతో చూస్తారు. అందుకే చాలా మంది తాము థర్డ్ జెండర్ అనే విషయాన్ని వెల్లడించరు. ‘గే’ పరిస్థితి కూడా అదే. ఒక అబ్బాయి మరొక అబ్బాయి పట్ల ఆకర్షితుడు కావడం, శృంగారం కోరుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటే వారిని గే అంటారు. మేల్ హోమో సెక్సువల్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి అసహజమైన కోరికలు. సమాజం అంగీకరించని విషయాలు.

సైన్స్ పరంగా చూస్తే ఇదంతా వారిలో మెడలో జరిగే ప్రక్రియ. విడుదలయ్యే స్రవాల కారణంగా కలిగే కోరికలు. మిత్రులు, కుటుంబ సభ్యులు, తోటి వారు స్వలింగ సంపర్కాన్ని తప్పుగా చూస్తారు. అందుకే తాము గే అని ఎవరూ బయటకు చెప్పరు. రహస్యంగా తమ వర్గం వారిని కలుసుకొని కోరికలు తీర్చుకుంటారు. తాజాగా హాలీవుడ్ నటుడు నోవా షన్నాప్ తాను గే అంటూ బహిరంగ ప్రకటన చేశాడు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఈ విషయం తెలియజేశారు.
నోవా సదరు వీడియో సందేశంలో… నేను గే అనే విషయం 18 ఏళ్ల పాటు ఎవరికీ చెప్పకుండా బాధపడ్డాను. ఇక ఆ బాధ భరించలేక మిత్రులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వారు దాన్ని అంగీకరించారు. ఆ విషయం ముందే తెలుసు అన్నారని నోవా తెలియజేశాడు. నోవా తాను గే అంటూ చేసిన ప్రకటన అభిమానులను షాక్ కి గురిచేసింది. వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విషయం వారిని ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలుస్తుంది. అయితే మెజారిటీ వర్గాలు… దాన్ని అంగీకరించి ఆయనకు మద్దతుగా నిలిచారు.

న్యూయార్క్ లో పుట్టిన నోరా ప్రస్తుత వయసు 18 ఏళ్ళు. 2015లో విడుదలైన బ్రిడ్జి ఆఫ్ స్పైస్ మూవీతో నటుడిగా మారాడు. ఆ మూవీ ఆస్కార్ వేదికపై మెరిసింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ తో నోవా ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ది ట్యూటర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దాదాపు 10 హాలీవుడ్ చిత్రాల్లో నోవా నటించారు.