spot_img
Homeఎంటర్టైన్మెంట్Dil Raju: సినిమా వ్యాపారాన్ని ఏ ఒక్కడు శాసించలేడు... వారసుడు చిత్ర వివాదం వెనుక...

Dil Raju: సినిమా వ్యాపారాన్ని ఏ ఒక్కడు శాసించలేడు… వారసుడు చిత్ర వివాదం వెనుక ఎవరున్నారో తెలుసన్న దిల్ రాజు

Dil Raju: నైజాం కింగ్, చిత్ర పరిశ్రమను శాసించే రారాజు, స్టార్ ప్రొడ్యూసర్, బడా డిస్ట్రిబ్యూటర్… దిల్ రాజు ప్రొఫైల్ ని వివరిస్తూ చిన్న పుస్తకం రాయొచ్చు. సాధారణ  డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినిమాను కనుసైగలతో కంట్రోల్ చేసే నవాబుగా ఎదిగాడనేది నిజం. ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలనేది నిర్ణయించేది దిల్ రాజే అంటారు . ఆయన కటాక్షం లేకుండా సినిమా థియేటర్స్ లో ఆడటం అంత ఈజీగా కాదు. ఈ క్రమంలో దిల్ రాజుపై తీవ్ర వ్యతిరేకత, అసహనం పరిశ్రమలో గూడుకట్టుకుందనే వాదన వినిపిస్తోంది. ఆ కారణంగానే వారసుడు మూవీ విడుదల వివాదాస్పదం అవుతుంది అంటున్నారు. ఇలాంటి పలు ప్రశ్నలకు దిల్ రాజు సమాధానాలు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Dil Raju
Dil Raju

ఇంట్లో రాజు అని పిలిచేవారు… నిర్మాతగా నా ఫస్ట్ మూవీ దిల్. రాజుకు దిల్ తగిలించి దిల్ రాజు చేశారు. డిస్ట్రిబ్యూటర్ గా ఉంటే ప్రేక్షకుడి మాదిరి సినిమా థియేటర్లో లో చూడాలి. దాని ఫలితం ఏమిటని ఎదురు చూడాలి.అందుకే నిర్మాతగా మారాను. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ కి సినిమా చూపించరు. కేవలం అంచనాలతోనే కొనాలి. నిర్మాతగా మారడానికి ఇది కూడా కారణం. నిర్మాణంలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. డబ్బులు పెట్టేది నిర్మాత తీసుకునేది మరొకరు.

బాహుబలి1 అన్ని వందల కోట్లు వసూలు చేసినా నిర్మాతకు మిగిలింది ఏమీ లేదు. ప్రొడ్యూసర్ గా 20 ఏళ్ళు పరిశ్రమలో ఉన్నాను. నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన నా మిత్రులు రియల్ ఎస్టేట్ వైపు వెళ్లి ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేను ఇక్కడే మిగిలిపోయాను. సినిమా వలన నేమ్ ఫేమ్ వస్తుంది అంతే. హీరో పేరు చెప్పి నిర్మాత సినిమా అమ్మేస్తారు. నిర్మాతల వలనే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకప్పుడు నలుగురు వ్యక్తులు కలిసి డిస్ట్రిబ్యూషన్ ని కంట్రోల్ చేశారు అన్నారు. మోనోపోలీ వచ్చిందన్నారు. 37 థియేటర్స్ తో పరిశ్రమను కంట్రోల్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ ఏ ఒక్కరూ సినిమా బిజినెస్ ని శాసించలేదు.

.

Dil Raju
Dil Raju

 

పేరుకే సినిమా వాళ్లంతా ఒక కుటుంబం… వాస్తవంలో ఎవరి నిర్ణయాలు వారివే. అందరూ కలిసి ఉండటం జరగని పని. సినిమా అంటేనే సిగ్గులేని, నీతిమాలిన, మానం లేని వ్యవస్థ. వారసుడు విడుదలను కొందరు కావాలనే  వివాదం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. అయితే నేను ఎవరినీ పాయింట్ చేసి మాట్లాడను. ఒక స్టార్ హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడంటే, తన తప్పులేదు. ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పేముంది. దిల్ రాజు అనే ఒక బ్రాండ్ పడింది, కొందరిలో అసూయ పెరిగింది.  రెండు దశాబ్దాల ప్రస్థానంలో నేను నిర్మాతగా లాభాల్లోనే ఉన్నాను, అని దిల్ రాజు అనేక విషయాలపై తన అభిప్రాయం తెలియజేశారు. మీకు పొలిటికల్ లీడర్స్ డబ్బు సమకూరుస్తున్నారట కదా అని అడగ్గా, దిల్ రాజు ఖండించారు.

 

Producer Dil Raju Open Heart With RK Promo || Season-3 || OHRK

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version