Homeట్రెండింగ్ న్యూస్Nityananda Swamy: అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానందుడు.. ఏం చేశాడో తెలుసా?

Nityananda Swamy: అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానందుడు.. ఏం చేశాడో తెలుసా?

Nityananda Swamy
Nityananda Swamy

Nityananda Swamy: ఏ దేశం ఎక్కడ ఉంది. ఏ దేశం సరిహద్దు ఏమిటి.. వనరులు ఏమిటి.. సైనిక బలం.. అస్త్ర శస్త్రాలు ఏమిటి అని ప్రపంచ దేశాలపై నిఘా పెట్టే అగ్రరాజ్యాం అమెరికానే బురిడీ కొట్టించాడు మన వివాదాస్పద గురువు నిత్యానంద. తమది ‘యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ కైలాస’ దేశమని, సాంస‍్కృతిక ఒప్పందాలు చేసుకుందామని తమ ప్రతినిధులను అమెరికాకు పంపించాడు. వాళ్లు కూడా స్వామీజీ పంపిప ప్రతినిధులు నిజమైన వాళ్లేనా.. అసలు ‘యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ కైలాస’ అనే దేశం ఉందా అని ఆలోచన కూడా చేయలేదు. చకచకా పత్రాలపై సంతకాలు చేశారు. కానీ, అసలు విషయం ఆలస్యంగా తెలుసుకుని తెల్లముఖం పెట్టారు.

దేశం నుంచి పారిపోయి..
వివాదాస్పద గురువు నిత్యానంద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే ‘యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ కైలాస’ అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Nityananda Swamy
Nityananda Swamy

నెవార్క్‌ నగరంలో ఒప్పందం…
అయితే ‘సిస్టర్ సిటీ’ పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్‌ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతోపాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది.

Nityananda Swamy
Nityananda Swamy

అసలు విషయం తెలిసి..
కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్‌ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version