
Balakrishna Troll: ఎంతో అనుభవం ఉన్న స్టార్ హీరోలు కూడా దర్శకులను గుడ్డిగా నమ్మేస్తారు. వారు చెప్పింది మారు మాట్లాడకుండా చేస్తారు. ఈ సన్నివేశాన్ని జనాలు అంగీకరిస్తారా? లేదా? అనే కామన్ సెన్స్ కూడా వాడరు. అలాంటి హీరోల్లో బాలయ్య ఒకరు. బాలయ్య సినిమాల్లోని చాలా సన్నివేశాలు ట్రోల్ కి గురయ్యాయి. పలనాటి బ్రహ్మనాయుడు మూవీలో ట్రైన్, కుర్చీ సీన్స్ అయితే నభూతో నభవిష్యతి. తొడగొట్టి బాలయ్య ట్రైన్ ని వెనక్కి పంపడం ఓ సంచలనం. అలాగే బాలయ్య పాండురంగడు మూవీలో చేసిన సాంగ్ ఆడియన్స్ కి పిచ్చెక్కించింది. ఒక భక్తిరస చిత్రంలో ఆ రేంజ్ అడల్ట్ కంటెంట్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు.
కథలో భాగంగా పాండురంగడు ఒక వేశ్య మోజులో పడి శృంగారంలో మునిగితేలుతూ ఉంటాడు. అది ఏ రేంజ్ ఎంజాయ్మెంటో పాటలో చెప్పాలని డైరెక్టర్ రాఘవేంద్రరావు డిసైడ్ అయ్యారు. సెట్ మొత్తం పూలు, పండ్లు, నీళ్ల కొలనులతో నింపేశాడు. శృంగారాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా సింబాలిక్ గా చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆయన వాడిన రిఫరెన్సులు చూస్తే కళామతల్లి గర్వంతో ఉప్పొంగిపోతుంది. టబు ఎదుట బాలయ్య బత్తాయిలు చేత్తో పిండడం, తబలా మీద, టబు బొడ్డు మీద బత్తాయి విసరగానే అవి బద్దలై విచ్చుకోవడం… అబ్బో చెప్పాలంటే చాలానే ఉంది.
ఈ సాంగ్ లో పీక్ మూమెంట్ ఏంటంటే… శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్లు చిటికిన వేలు మీద టబును బాలయ్య ఎత్తాడు. ఇది దర్శకేంద్రుని క్రియేటివికీ పరాకాష్ట. రాఘవేంద్రరావుకు ఆ బొడ్డు ఫాంటసీ ఒకటి ఉంది. హీరోయిన్ ఎవరైనా కానీ బొడ్డు చూపించాల్సిందే.. హీరో పువ్వో కాయో విసరాల్సిందే.

ఈ వీడియో సాంగ్ ని బయటకు తీసిన తమిళ ట్రోలర్స్ ఫన్నీ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. అనూహ్యంగా ఈ ట్రోలింగ్ వీడియోకి నటుడు ప్రకాష్ రాజ్ లైక్ కొట్టాడు. బాలయ్యను, దర్శకుడు క్రియేటివిటీని అవమానించేలా ఉన్న సదరు ట్రోలింగ్ వీడియోను ప్రకాష్ రాజ్ లైక్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. జస్ట్ కామెడీ ఫీల్ అయ్యారా? లేక ఆయన కూడా సెటైర్ వేశాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. రాఘవేంద్రరావు ఏకంగా తన బొడ్డుపై కొబ్బరి కాయలు, గుమ్మడికాయ విసిరించాడని చెప్పి, తాప్సి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఎగతాళి చేసింది. ఆమె మాటలకు అక్కడ ఉన్నవాళ్లు కిందపడి మరి నవ్వారు. ఆయన డైరెక్షన్ లో ఆమె ఝుమ్మంది నాదం చిత్రం చేసింది.
What the Hell did I just see 🙈pic.twitter.com/dufdGGiTwl
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳 (@ChekrishnaCk) February 16, 2023