Chiranjeevi- Nayantara: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు నయనతార..దాదాపుగా ప్రతీ స్టార్ హీరో తో కలిసి నటించిన నయనతార, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది..అయితే నయనతార ని వివాదాలను మనం ఎప్పుడూ కూడా విడివిడిగా చూడలేము..ఎదో ఒక కాంట్రవర్సీ ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటుంది..నయనతార సాధారణంగా ఏ సినిమా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనదు.

ఈ కండిషన్ మీదనే ఆమె ఏ సినిమాకైనా సంతకం చేస్తుంది..కానీ మెగాస్టార్ చిరంజీవి తో నటించిన ‘సై రా నరసింహా రెడ్డి’ మరియు ‘గాడ్ ఫాదర్’ చిత్రాల ప్రొమోషన్స్ లో పాల్గొంటాను అని సంతకం చేసింది..కానీ ఆమె చివరి నిమిషం లో ప్రొమోషన్స్ లో పాల్గొనకుండా మెల్లగా జారుకుంది..ఇక గాడ్ ఫాదర్ మూవీ ప్రొమోషన్స్ కి అయితే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన కూడా ఆమె ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు.
ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా నటించిన ‘కనెక్ట్’ అనే చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ బాషలలో విడుదలైంది..పెళ్లి తర్వాత నయనతార నుండి విడుదలైన రెండవ సినిమా ఇది..ఈ సినిమా విడుదలకు ముందు నయనతార ఎన్నడూ లేని విధంగా ప్రొమోషన్స్ లో పాల్గొన్నది..పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది..ముఖ్యంగా ఆమె ప్రముఖ యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ముందుగా సుమ ఆమెని ప్రశ్న అడుగుతూ ‘గాడ్ ఫాదర్ సినిమా సమయం లో ప్రొమోషన్స్ కోసం చిరంజీవి మిమల్ని స్వయంగా అడిగినా కూడా మీరు నో చెప్పారట కదా’ అని అడగగా.

అందుకు నయనతార సమాధానం చెప్తూ ‘ఆ మూవీ విడుదల సమయం లో నేను ఫారిన్ ట్రిప్ లో ఉన్నాను..అందుకే ప్రొమోషన్స్ కి హాజరు కాలేకపోయాను..ఈ విషయం చిరంజీవి గారికి కూడా చెప్పి క్షమాపణలు కోరాను’ అని చెప్పింది..కనెక్ట్ చిత్రం తన సొంత నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమా కాబట్టే నయనతార ప్రొమోషన్స్ కి వచ్చిందని..ఇతర సినిమాలను ఆమె పట్టించుకోదు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో నయన్ పై మండిపడుతున్నారు.