https://oktelugu.com/

Prem Rakshit Biography: గ్రూప్ డ్యాన్సర్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ వరకు.. కొరియోగ్రాఫర్ ‘ప్రేమ్ రక్షిత్’ జీవితం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Choreographer Prem Rakshit Biography : మట్టిలో నుండి మాణిక్యాలు పుడుతాయని పెద్దలు చెప్పే మాటలు ఊరికినే అనలేదు.. అలాంటి ఉదాహరణలు ప్రతీ రోజు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. అలాంటి ప్రతిభ ఉన్న వారిలో ఒకరు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ‘నాటు నాటు’ సాంగ్ తో డ్యాన్స్ వేయిస్తున్నాడాయన. ఇటీవలే ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. దేశం మొత్తం గర్వించేలాగా చేసిన ప్రేమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2023 / 09:37 AM IST
    Follow us on

    Choreographer Prem Rakshit Biography : మట్టిలో నుండి మాణిక్యాలు పుడుతాయని పెద్దలు చెప్పే మాటలు ఊరికినే అనలేదు.. అలాంటి ఉదాహరణలు ప్రతీ రోజు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. అలాంటి ప్రతిభ ఉన్న వారిలో ఒకరు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ‘నాటు నాటు’ సాంగ్ తో డ్యాన్స్ వేయిస్తున్నాడాయన. ఇటీవలే ఈ పాట ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. దేశం మొత్తం గర్వించేలాగా చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన బయోగ్రఫీని ఇప్పుడు చూద్దాం.

    -బాల్యం:

    ప్రేమ్ రక్షిత్ మాస్టర్ 1977వ సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీన చెన్నైలో జన్మించాడు.. ఆయన తండ్రి డైమండ్స్ వ్యాపారం చేసేవాడు. తల్లి గృహిణి. చిన్నప్పుడు తన విద్యాబ్యాసాన్ని చెన్నై లోని ‘గాబ్రియల్ హయ్యర్ సెకండరీ స్కూల్’లో పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి ప్రేమ్ రక్షిత్ కి గ్రాఫిక్స్ డిజైనర్ అవ్వాలనే కోరిక ఉండేది. వీఎఫ్ఎక్స్ కోర్స్ లో పట్టా కూడా పొందాడు, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఆయనకి వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత డ్యాన్స్ కొరియోగ్రాఫేర్ గా ఇండస్ట్రీ లో స్థిరపడేందుకు చాలా కష్టపడ్డాడు.

    -కెరీర్:

    ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యే ముందు ప్రభుదేవా, లారెన్స్ మరియు రాజు సుందరం వంటి డ్యాన్స్ మాస్టర్స్ కి అసిస్టెంట్ గా ఎన్నో సినిమాలు చేసాడు, 1993వ సంవత్సరం నుండి కృషి చేస్తే 2005వ సంవత్సరంలో కొరియోగ్రాఫర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఆయనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత మాత్రం రాజమౌళిదే. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేసాడు. ఆ తర్వాత వెంటనే విక్రమార్కుడు సినిమాకి కూడా కొరియోగ్రాఫర్ గా పని చేసాడు. అలా రాజమౌళి ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ చిత్రం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ జీవితాన్నే మార్చేసింది.

    ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఆయన వేయించిన ‘నాచోరే నాచోరే’ అనే పాటకి రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి. అభిమానులతో పాటు ప్రేక్షకుల మైండ్ కూడా దెబ్బకి బ్లాక్ అయ్యింది, ఆ సినిమా తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ రాజమౌళి తీసే ప్రతీ సినిమాకి ఉండాల్సిందే, ఏ దర్శకుడు ఆయన వైపు చూసిన చూడకపోయినా రాజమౌళి మాత్రం ఆయనకీ అవకాశాలు ఇస్తూనే వస్తున్నాడు. రీసెంట్ గా #RRR చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఒకవేళ మన అదృష్టం బాగుంది ఆస్కార్ అవార్డు వస్తే మాత్రం ప్రపంచం మొత్తం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పేరు మారు మోగిపోతుంది. ఆరోజు కచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.