Walthair Veeraiah Collections : 30వ రోజు చరిత్ర సృష్టించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం.. ఇదెక్కడి అరాచకం సామీ

Walthair Veeraiah Collections :: ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆకలితో ఉన్న మెగా ఫ్యాన్స్ కి భుక్తాయాసం వచ్చేలా చేసింది.. చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి వస్తున్న లాంగ్ రన్ ని చూసి తలపండిన ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. నేటికీ ఈ […]

Written By: NARESH, Updated On : February 12, 2023 9:45 am
Follow us on

Walthair Veeraiah Collections :: ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆకలితో ఉన్న మెగా ఫ్యాన్స్ కి భుక్తాయాసం వచ్చేలా చేసింది.. చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి వస్తున్న లాంగ్ రన్ ని చూసి తలపండిన ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

నేటికీ ఈ సినిమా విడుదలై 30 రోజులు పూర్తి చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈనెల 27వ తారీఖున ఓటీటీలో విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది కూడా. అయినా కానీ వసూళ్ల పరంగా ఈ సినిమా తన సత్తాని చాటుతూ ముందుకు దూసుకుపోతోంది. 68 ఏళ్ళ వయస్సు లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న బాక్స్ ఆఫీస్ స్టామినా ని చూసి దురాభిమానులు సైతం ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది.

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం.. ఈ సినిమా ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా 30వ రోజు ఈ సినిమా ఒక అరుదైన రికార్డు ని నెలకొల్పింది. చాలా ప్రాంతాలలో ఈ చిత్రానికి మొన్న విడుదలైన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘అమిగోస్’ కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసింది.

ఇది చూసి అందరూ షాక్ కి గురయ్యారు, అంటే ఈరోజు కూడా ఈ సినిమాకి 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.అదే కనుక జరిగితే ఈ సినిమాకి శివరాత్రి రోజు కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఫుల్ రన్ లెక్క చివరిగా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.