సాధారణంగా గ్రహశకలం భూమిని తాకుతుందని తెలిస్తే ప్రతి ఒక్కరూ చనిపోయే అవకాశం ఉందని అందరూ భావిస్తారు. కానీ నాసా తాజాగా కనుగొన్న గ్రహశకలం సాధారణ గ్రహశకలం కాదు. ఈ గ్రహశకలం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరినీ కోటీశ్వరులను చేయగలదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. నాసా కొన్ని నెలల క్రితం కనుగొన్న 16 సైకీ అనే గ్రహశకలం గురించి అనేక పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను వెల్లడించింది.
Also Read : వామ్మో.. ‘జపాన్’లో మరో వింత వ్యాధి.. రోడ్లపైనే పడిపోతున్నారు!
చంద్రుడిలో ఒకటో వంతు కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం బంగారం, నికెల్, ఐరన్, ప్లాటినం లాంటి విలువైన వస్తువుల గనులతో నిండి ఉంది. భార కరెన్సీలో ఈ గ్రహశకలం విలువ 48305249999999990000000 రూపాయలు. ఈ గ్రహశకలం సొంతమైతే ప్రపంచంలో పేదరికమే ఉండదు. అప్పులు లేకుండా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందడంతో పాటు కొన్ని తరాలు తిని కూర్చున్నా తరగనంత ఆస్తి పెరుగుతుంది.
భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం దగ్గరకు చేరుకోవడానికి నాసా ప్రయత్నిస్తోంది. ఈ గ్రహశకలం పొడవు దాదాపు 140 మైళ్లు. బృహస్పతి, అంగారకుడు గ్రహాలకు మధ్యలో ఈ గ్రహశకలం కదులుతోంది. ఈ ప్రాజెక్ట్ ను నాసా త్వరగానే మొదలుపెట్టాలని అనుకుంటున్నా కరోనా వైరస్ విజృంభణ వల్ల ఆలస్యమవుతోంది. ఒక గ్రహాన్ని మరో గ్రహం ఢీ కొనడంవల్ల గ్రహశకలం ఏర్పడుతుంది. నాసా గ్రహంలోని సంపదను సొంతం చేసుకోవాలని తమకు లేదని పరిశోధనలు చేయడమే తమకు ముఖ్యమని నాసా పేర్కొంది.