Ramya Raghupathi- Naresh: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు ముందు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతికకాయం ఉంచారు. ప్రముఖులు అక్కడే ఆయనకు నివాళులు అర్పించారు. అభిమానులను కొద్ది మొత్తంలో అనుమతించినట్లు సమాచారం. కాగా కృష్ణను చివరి చూపు చేసేందుకు అనుకోని వ్యక్తి అక్కడకు వచ్చారు. ఆమెను చూసిన నరేష్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఆమె ఎవరో కాదు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి. నిన్న పద్మాలయ స్టూడియోకి ఆమె వచ్చారు. అక్కడ రమ్యను చూసి నరేష్ షాక్ తిన్నారు. వారిద్దరి మధ్య పెద్ద వివాదం నడుస్తున్న నేపథ్యంలో రమ్య రఘుపతి కృష్ణకు నివాళులు అర్పించేందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రమ్య రఘుపతికి కృష్ణతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది. నరేష్ భార్యగా రమ్య కొన్నేళ్ల పాటు కృష్ణతో కలిసి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన మామయ్య కృష్ణను కడసారి చూసేందుకు ఆమెకు కర్ణాటక నుండి వచ్చారు. ఆమె వచ్చిన సమయంలో నరేష్, పవిత్ర లోకేష్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో వారి మధ్య ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంది. కృష్ణ పార్థివ దేహాన్ని చూసి, ఆయనకు నివాళులు అర్పించి రమ్య అక్కడి నుండి వెళ్లిపోయారు.
కాగా నరేష్-రమ్య రఘుపతి విడిపోయి చాలా కాలం అవుతుంది. ఆమె దూరమయ్యాక నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. అయితే నరేష్ చట్టబద్ధంగా తనకు విడాకులు ఇవ్వలేదని రమ్య ఆరోపిస్తున్నారు. విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం నేరమని ఆమె మండిపడుతున్నారు. ఆ మధ్య మైసూర్ హోటల్ లో నరేష్-పవిత్ర స్టే చేశారు. ఆ విషయం రమ్యకు తెలిసి గది ముందు బైఠాయించారు. పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నరేష్, పవిత్రలను రమ్య చెప్పుతో కొట్టబోయింది.

నరేష్ పై రమ్య రఘుపతి న్యాయపోరాటం చేస్తున్నట్లు సమాచారం. నరేష్ కారణంగా ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. వారిప్పుడు ఆమె వద్దే పెరుగుతున్నారు. ఇక పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. మేము సహజీవనం చేస్తున్నామని నరేష్ స్పష్టత ఇచ్చారు. రెండేళ్లకు పైగా నరేష్-పవిత్ర కలిసి జీవిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వీరి విషయం బహిర్గతమైంది.