https://oktelugu.com/

Naresh – Ramya : నరేష్ బ్లూ ఫిలిమ్స్ చూస్తాడు, నాకు డ్రైవర్ తో ఎఫైర్ అంటగట్టాడు… రమ్య సంచలన ఆరోపణలు

Naresh – Ramya : నటుడు నరేష్ నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్న వేళ… ఆయన మూడో భార్య రమ్య రఘుపతి దారుణమైన ఆరోపణలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి నరేష్ వ్యక్తిగత జీవితం బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ… నరేష్ నాకు ఎఫైర్స్ అంటగట్టాడు. డ్రైవర్ తో పాటు పలువురితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానని నిందలు వేశాడు. మనసులో నా గురించి తప్పుగా ఊహించుకునేవాడు. నోటికి వచ్చింది మాట్లాడుతూ నన్ను దూషించేవాడు. అవి నా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2023 / 09:08 AM IST
    Follow us on

    Naresh – Ramya : నటుడు నరేష్ నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్న వేళ… ఆయన మూడో భార్య రమ్య రఘుపతి దారుణమైన ఆరోపణలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి నరేష్ వ్యక్తిగత జీవితం బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ… నరేష్ నాకు ఎఫైర్స్ అంటగట్టాడు. డ్రైవర్ తో పాటు పలువురితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానని నిందలు వేశాడు. మనసులో నా గురించి తప్పుగా ఊహించుకునేవాడు. నోటికి వచ్చింది మాట్లాడుతూ నన్ను దూషించేవాడు. అవి నా కొడుకు రణ్వీర్ ని డిస్టర్బ్ చేసేవి. రణ్వీర్ మానసిక ఒత్తిడికి గురయ్యేవారు.

    నరేష్ కి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. నరేష్ అలాంటి వీడియోలు చూడటం రణ్వీర్ కి కూడా తెలుసు. అమ్మా… డాడీ డర్టీ వీడియోలు చూస్తున్నాడని పలుమార్లు నాతో వచ్చి చెప్పాడు. కొడుకు ముందు ఎలా ప్రవర్తించాలో నరేష్ కి తెలియదు. బాధ్యతగా ఉండాల్సిన తండ్రి ఛండాలంగా ప్రవర్తించాడు… అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. రమ్య రఘుపతి కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

    పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోవడానికి రమ్య రఘుపతికి నరేష్ విడాకులు ఇచ్చాడన్న ప్రచారం జరుగుతుంది. పెద్ద మొత్తంలో భరణంగా ఆమెకు అప్పజెప్పి డీల్ చేసుకున్నారన్న కథనాల నేపథ్యంలో రమ్య రఘుపతి లేటెస్ట్ కామెంట్స్ కొత్త అనుమానాలకు కారణం అవుతున్నాయి. పవిత్ర లోకేష్ తో పెళ్లి ప్రకటన తర్వాత రమ్య రఘుపతి నోరు విప్పలేదు. ఆమె మీడియా ముందుకు రాలేదు. దీంతో ఆమెకు ఈ వివాహం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని భావించారు.

    కాగా కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె అయిన రమ్య రఘుపతిని కొన్నేళ్ల క్రితం నరేష్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. వీరు విడిపోయి ఐదేళ్లు అవుతుంది. అనంతరం నరేష్ పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. కొన్నాళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నారు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా ఇద్దరూ కలిసి నటించారు. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి ప్రకటన చేశాడు. ఈ ఏడాది నరేష్-పవిత్రలు పెళ్లి చేసుకొని తమ బంధం అధికారికం చేసుకోనున్నారు.