https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh: మళ్ళీ లొల్లి… ఆమె ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో?

Naresh – Pavitra Lokesh: ఇక్కడ ఎవరిని ఎవరు గెలుగుకుతున్నారో అర్థం కావడం లేదు. ఓ రెండు నెలలుగా నిద్రాణంలో ఉన్న రమ్య రఘుపతికి నరేష్ భారీ షాక్ ఇచ్చాడు. మళ్ళీ పెళ్లి టీజర్ చూశాక ఆమె కోపం నషాళానికి ఎక్కి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రమ్య రఘుపతి రియాక్షన్ కోసం మీడియా వెయిటింగ్ అన్నమాట. ఓ ఏడాది కాలంగా డైలీ సీరియల్ లా నరేష్-పవిత్ర-రమ్య రఘుపతి ఎపిసోడ్ నడుస్తుంది. ఒక దశలో వీరి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2023 / 05:34 PM IST
    Follow us on

    Naresh – Pavitra Lokesh

    Naresh – Pavitra Lokesh: ఇక్కడ ఎవరిని ఎవరు గెలుగుకుతున్నారో అర్థం కావడం లేదు. ఓ రెండు నెలలుగా నిద్రాణంలో ఉన్న రమ్య రఘుపతికి నరేష్ భారీ షాక్ ఇచ్చాడు. మళ్ళీ పెళ్లి టీజర్ చూశాక ఆమె కోపం నషాళానికి ఎక్కి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రమ్య రఘుపతి రియాక్షన్ కోసం మీడియా వెయిటింగ్ అన్నమాట. ఓ ఏడాది కాలంగా డైలీ సీరియల్ లా నరేష్-పవిత్ర-రమ్య రఘుపతి ఎపిసోడ్ నడుస్తుంది. ఒక దశలో వీరి ఆరోపణలు హద్దులు దాటేశాయి. నరేష్ ని ఉద్దేశిస్తూ రమ్య రఘుపతి దారుణ కామెంట్స్ చేశారు.

    నరేష్ పెద్ద ఉమనైజర్. నా కొడుకు ముందే నీలి చిత్రాలు చూస్తాడు. నాన్న బ్యాడ్ వీడియోలు చూస్తున్నాడని మా అబ్బాయి పలుమార్లు చెప్పాడు. ఇతర మహిళలతో అక్రమ సంబంధం నెరుపుతూ పలుమార్లు పట్టుబడ్డాడు. నరేష్ బలహీనతలు వాళ్ళ అమ్మ విజయనిర్మలకు కూడా తెలుసు. ఎప్పటికైనా మారతాడని నన్ను సముదాయించేది. నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగట్టాడు. దేవుడు లాంటి కృష్ణతో నాకు ఎఫైర్ ఉందని ఆరోపణలు చేశాడు. నా నుండి కృష్ణకు ప్రాణహాని ఉందని కేసులు పెట్టించాడు… అంటూ రమ్య రఘుపతి విరుచుకుపడ్డారు.

    రమ్య రఘుపతి ఆరోపణలు చేసిన కొన్నాళ్ళకు నరేష్ మీడియా ముందుకు వచ్చాడు. ఆయన అంతకంటే నీచమైన విమర్శలు రమ్య రఘుపతి మీద చేశాడు. నన్ను చంపేందుకు ప్లాన్ చేసింది. నా మొబైల్ టాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసుకుంది. ఆమెకు దూరమై చాలా కాలం అవుతుంది. వ్యాపారాల పేరుతో డబ్బులు నాశనం చేసింది. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. తనకు నా ఆస్థి మాత్రమే కావాలి. నా కొడుకు ఆమె వద్ద ఉండటం సేఫ్ కాదు. నా భార్యగా ఉంటూ బెంగుళూరులో అక్రమ సంబంధాలు నడిపింది. ఆమె తాగుబోతు, తిరుగుబోతు అని… ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Naresh – Pavitra Lokesh

    నరేష్ విడాకులు కావాలి అంటుంటే… రమ్య రఘుపతి వద్దంటుంది. అలాగే పవిత్రతో ఆయన వివాహం జరగనీయనని శబధం చేస్తుంది. ఈ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో నరేష్ చేసిన పని సంచలనమైంది. మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఆయన నటిస్తున్న మూవీ టీజర్ విడుదలైంది. తన కథనే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు నరేష్. ఈ కథలో నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి ప్రధాన పాత్రలు.

    ఈ సినిమాపై రమ్య రఘుపతి ఫైర్ అయ్యే అవకాశం కలదు. అనుమతి లేకుండా తన గురించి సినిమా తీస్తున్నాడని ఆమె ఆరోపించవచ్చు. మక్కీకి మక్కి ఆమె నిజ జీవితాన్ని వనిత విజయ్ కుమార్ తో చేయించారు. కాబట్టి ఇది వివాదం కానుంది. రమ్య రఘుపతి టీజర్ చూసే ఉంటారు. అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉంటారు. సో…. ఇది