Naresh – Pavitra Lokesh Marriage
Naresh – Pavitra Lokesh Marriage: నిత్య పెళ్ళికొడుకు నరేష్ మళ్ళీ పెళ్లి పై అప్డేట్ ఇచ్చారు. టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నరేష్-పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రచారం కోసం నరేష్ చాలా స్టంట్స్ వేశారు. ఫస్ట్ త్వరలో పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో నరేష్-పవిత్ర ముద్దులు పెట్టుకోవడం సంచలనమైంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఏకంగా పెళ్లి వీడియో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో మీద పెద్ద చర్చ నడిచింది. అసలు ఇది నిజమైన పెళ్లా? ఏదైనా షూటింగ్ లో భాగమా? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. నరేష్ ని వివరణ కోరగా ఆయన చెప్పలేదు. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రశ్న దాటవేశారు. ఇటీవల సస్పెన్సు కి తెర దించుతూ మళ్ళీ పెళ్లి చిత్ర ప్రకటన చేశారు. నరేష్-పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి ఎం ఎస్ రాజు దర్శకుడు.
మళ్ళీ పెళ్లి టీజర్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. ఈ విషయం తెలియజేస్తూ… అధికారిక ప్రకటన చేశారు. ఓ అద్భుతమైన పోస్టర్ పంచుకున్నారు. మళ్ళీ పెళ్లి చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుందని ఇదివరకే చెప్పారు. అయితే డేట్ ఇంకా నిర్ణయించలేదు. నరేష్-పవిత్రల చుట్టూ గత ఏడాది కాలంగా భారీ హైడ్రామా నడుస్తుంది. ఈ క్రమంలో మళ్ళీ పెళ్లి చిత్రానికి భారీ ప్రచారం దక్కింది.
Naresh – Pavitra Lokesh Marriage
గత ఐదేళ్లుగా పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఆయన మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయాక పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. పవిత్ర లోకేష్ మేటర్ బహిర్గతం అయ్యాక… రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. నరేష్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. నరేష్-పవిత్రల వివాహం చెల్లదు. నేను విడాకులు కోరుకోవడం లేదు. వారి వివాహం జరగనివ్వనని రమ్య రఘుపతి శబధం చేస్తున్నారు.
Experience the Magic of Love with the Teaser of #MalliPelli – Telugu ❤️🔥#MattheMaduve – Kannada ❤️🔥
RELEASING ON APRIL 13th 🫶
Directed by @MSRajuOfficial #PavitraLokesh @vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic
Summer 2023 Release! pic.twitter.com/3AT2b7HQvw
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) April 8, 2023