
Nara Lokesh Selfie Challenge: లోకేష్ యువగళం పాదయాత్రను అధికార పార్టీ లైట్ తీసుకుంది. పెద్ద హైప్ రాదని భావించింది. అయితే ప్రభుత్వ చర్యలు పుణ్యమా అని ఆటోమేటిక్ గా పాదయాత్రకు మంచి ప్రచారమే కల్పించారు. ఎక్కడిక్కడే అడ్డుకొని వార్తల్లో నిలిచేటట్టు చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాంటీ ప్రచారంతో హోరెత్తించింది. అయితే అప్పటికే ప్రజలు స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. ఆ స్థాయి మీడియా చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఊహించుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రకు వ్యతిరేకంగా కథనాలు, వార్తలు వస్తుండడంతో అది వాస్తవ విరుద్ధమన్న భావనకు వచ్చారు. అటు లోకేష్ కూడా రాటు దేలుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని తన యువగళం పాదయాత్రను వేదికగా చేసుకొని ఎండగడుతున్నారు.
అయితే లోకేష్ ప్రధానంగా ఎంచుకున్న విమర్శనాస్త్రం సెల్ఫీల చాలెంజ్. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో స్పీచ్ లు, పంచ్ లతో విరుచుకుపడుతుండగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి మాత్రం సెల్ఫీల చాలెంజ్ కే ప్రాధాన్యమిస్తున్నారు. పాదయాత్రలో తనకు ఎదురైన అంశాలు, పాలన లోటుపాట్లు, ప్రభుత్వ అసమర్థత చర్యలతో కనిపించే లోపాలను తన సెల్ఫీల్లో బంధించి ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతను లోకేష్ ఆకట్టుకోగలుగుతున్నారు. చాలెంజింగ్ సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను తీసుకొచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగుతున్నారు. వాటినే పోస్టుపెడుతున్నారు. మీరు తెచ్చిన పరిశ్రమలు ఏవీ? అంటూ ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రలో దారిపొడవునా ప్రతీరోజు తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే లోకేష్ సవాళ్లకు వైసీపీ పెద్దగా రియాక్టు కావడం లేదు. రిప్లయ్ ఇవ్వడం లేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం తన మార్కును చూపిస్తోంది. లోకేష్ దిగుతున్న సెల్ఫీ ఫొటోలను సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల వద్ద దిగినట్టు చూపిస్తోంది. అయితే దీనిపై టీడీపీ సోషల్ మీడియా అదే స్థాయిలో రిప్లయ్ ఇస్తోంది. ప్రజలకు, నెటిజన్లకు వాస్తవ పరిస్థితి ఇది అంటూ చెబుతోంది.

అయితే సెల్ఫీ చాలెంజ్ ల కోసం లోకేష్ పెద్దగా వెతుక్కోవడం లేదు. ఎక్కడిపడితే అక్కడే దర్శనమిస్తున్నాయి. రహదారులు బాగా ఉండడం లేదు. ఎక్కడ చూసిన వైన్ షాపులు, ఫిష్ ఆంధ్రా షాపులు.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వంపై విమర్శించడానికి అవసరమైన అన్ని వనరులు లోకేష్ కు సహజసిద్ధంగానే లభిస్తున్నాయి. వాటి దగ్గర ఫొటోలకు దిగుతున్న లోకేష్ అందమైన రాతలతో సెల్ఫీ ఫొటోలకు సరికొత్త అర్ధం చెబుతున్నారు. అయితే స్ట్రయిట్ గా రిప్లయ్ ఇచ్చేందుకు భయపడుతున్న వైసీపీ సోషల్ మీడయా విభాగాన్ని ఉసిగొల్లుతోంది. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల్లోకి మాత్రం ఆ కామెంట్స్ ను తీసుకెళ్లలేకపోతున్నారు.
