The Paradise Teaser Review: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ‘దసరా’. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగిన నాని, ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ లో వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్ ప్రాంతాల్లో స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ ని ఈ సినిమాతో నెలకొల్పాడు. తనకు అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో నాని మరోసారి ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ గ్లిమ్స్ వీడియో అభిమానుల అంచనాలకు మించి ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఇలాంటి సబ్జెక్టు ని కూడా ఆలోచించొచ్చా అనే విధంగా ఆ గ్లిమ్స్ వీడియో ఉంది.
Also Read: అసలు ఈ అనోరా మూవీలో ఏముంది? ఎందుకు ఆస్కార్ పంట పండించింది?
‘చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసారు కానీ, అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఏ గ్రంధంలోనూ రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా జమానా కాలం నుండి నడుస్తున్న శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ’ అంటూ వాయిస్ ఓవర్ తో ఈ గ్లిమ్స్ వీడియో మొదలు అవుతుంది. గ్లిమ్స్ మధ్యలో ఒక బూతు పదం కూడా ఉంటుంది. ఆ బూతు పదాన్ని హీరో తన చేతికి పచ్చబొట్టు వేయించుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇలాంటి సన్నివేశాలకు ఒప్పుకున్నందుకు నిజంగా నాని ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ పదం తో మనల్ని పిలిస్తే ఏ రేంజ్ కోపం వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు, కాకులకు లింకి ఏమిటి?.
Also Read: ‘సలార్ 2’ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ లో చూపించబోతున్నాడా..?
టీజర్ చివర్లో నాని కాకుల జాతిని రక్షించే సంరక్షకుడిగా కనిపిస్తాడు. సినిమా మెయిన్ థీమ్ ఇదేనా?, లేదా కాకులను వేరే ఉద్దేశానికి ఉదహరిస్తూ గ్లిమ్స్ లో చూపించారా అనేది తెలియాల్సి ఉంది. గ్లిమ్స్ వీడియోలో నాని లుక్ ని చూపించలేదు కానీ, సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించేసారు. వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ‘దసరా’రేంజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా?, లేకపోతే దసరా ని మించిన హిట్ అవుతుందా అనేది. ఈ సినిమాతో నాని అధికారికంగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టినట్టే. రీసెంట్ గానే ఆయన ‘హిట్ : ది థర్డ్ కేస్’ సినిమా టీజర్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ గ్లిమ్స్ తో మరోసారి సర్ప్రైజ్ చేసాడు. నాని ఎంచుకుంటున్న స్టోరీలు నిజానికి ఈ కాలంలో స్టార్ హీరోలు కూడా ఎంచుకోవట్లేదు అనేది వాస్తవం.
