
Nani Dasara Collections: మీడియం రేంజ్ హీరోలకు వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలా మీడియం రేంజ్ హీరోలలో వంద కోట్ల గ్రాస్ ని అందుకున్న మొట్టమొదటి హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరో గా నటించిన ‘గీత గోవిందం’ అనే చిత్రం 130 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి F2 మరియు F3 చిత్రాలతో రెండు సార్లు వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్నాడు.వీళ్ళ తర్వాత సీనియర్ హీరో బాలయ్య ‘అఖండ’ చిత్రం తో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోగా, మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ‘ధమాకా’ చిత్రం తో వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు.ఇప్పుడు రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని ఈ క్లబ్ లోకి అడుగుపెట్టాడు.
ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దసరా’ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 45 కోట్ల రూపాయిల షేర్ మరియు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.ఇప్పుడు ఈ చిత్రం రీసెంట్ గా 100 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంది.నేడు లేదా రేపు మ్యాటినీ షోస్ లోపు ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతుందని టాక్.

ఫుల్ రన్ లో వంద కోట్లు కొల్లగొట్టడమే పెద్ద టాస్క్ అయినా ఈ రోజుల్లో నాని కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ చిత్రం తెలంగాణ లో వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఫుల్ రన్ లో ఓవర్ ఆల్ గా 60 కోట్ల రూపాయిల షేర్ , 120 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.