https://oktelugu.com/

Dasara Collections : విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ కి దరిదాపుల్లో రాలేకపోయిన నాని ‘దసరా’

Nani Dasara Movie Collections : లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘దసరా’.న్యాచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా స్టార్ హీరో సినిమా రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 12 రోజులు పూర్తి కావొస్తుంది, ఈ 12 రోజులకు గాను ఈ సినిమా సుమారుగా 62 కోట్ల రూపాయిల షేర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2023 / 08:44 PM IST
    Follow us on

    Nani Dasara Movie Collections : లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘దసరా’.న్యాచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా స్టార్ హీరో సినిమా రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 12 రోజులు పూర్తి కావొస్తుంది, ఈ 12 రోజులకు గాను ఈ సినిమా సుమారుగా 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టింది.

    విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయిల వరకు జరగగా, ఓవరాల్ గా 12 రోజులకు 12 కోట్ల రూపాయిల లాభాలను రాబట్టింది.ఫుల్ రన్ లో మరో నాలుగు కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.వసూళ్లు అద్భుతంగా వచ్చాయి కానీ ఈ చిత్రం విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘గీత గోవిందం’ ఫుల్ రన్ వసూళ్లను మాత్రం దాటలేకపోయింది.

    2018 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటి వరకు ఈ చిత్రం వసూళ్లను ఒక్క మీడియం హీరో కూడా దాటలేకపొయ్యాడు.విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘F2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 82 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకుంది.

    కానీ ఇది సోలో క్రెడిట్ ఏ హీరో కి కూడా దక్కదు, అది మల్టిస్టార్రర్ సినిమా కాబట్టి.నాని నటించిన ‘దసరా’ చిత్రం మాత్రం కచ్చితం గా ‘గీత గోవిందం’ కలెక్షన్స్ ని దాటేస్తుందని అనుకున్నారు, కానీ కనీసం 7 కోట్ల రూపాయిల దూరం తో ఈ సినిమా ఆగిపోయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.మరి ఈ సినిమా వసూళ్లను రాబొయ్యే రోజుల్లో ఏ హీరో దాటుతాడో చూడాలి.