
Tarakaratna Last Wish: సినీ హీరో గా పెద్దగా సక్సెస్ లు చూడకపోయినా నటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నంది అవార్డు కూడా సంపాదించుకున్న హీరో నందమూరి తారకరత్న.ఒక మంచి మనిషిగా ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం లో తారకరత్న కి సాటి మరెవ్వరు రారు అని అంటుంటారు ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళంతా.అందరినీ ఎంతో ప్రేమగా పలకరించడం తారకరత్న స్వభావం.
అలాంటి మంచి మనిషి ఈరోజు మన మధ్య లేడు అనే విషయాన్నే జీర్ణించుకోవడం చాలా కష్టం గా ఉంది.కుప్పం లో గుండెపోటు వచ్చి హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ గత 23 రోజుల నుండి చావు తో పోరాటం చేసిన తారకరత్న, సంపూర్ణ ఆరోగ్యవంతుడై బయటకి వస్తాడని అందరూ అనుకున్నారు.కానీ ఇలా తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా అతని ప్రేమని పొందిన వాళ్ళ రూపం లో ఎప్పటికీ బ్రతికే ఉంటదంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో ఎమోషనల్ గా పోస్టులు పెడుతున్నారు.
అయితే నందమూరి తారకరత్న తన చివరి కోరిక నెరవేరక ముందే చనిపోవడం ఆయన అభిమానుల మనసుల్ని కలిచివేస్తుంది.ఆయన కోరిక ఏమిటంటే తనకి ఎంతో ఇష్టమైన నందమూరి బాలకృష్ణ తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనేదే.బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తారకరత్న కి ఒక ముఖ్యమైన పాత్ర కూడా బాలయ్య డిజైన్ చేయించాడట.అలా తన బాబాయ్ పక్కన నటించే అవకాశం దక్కినందుకు గాను తారకరత్న ఎంతో మురిసిపోయి తన స్నేహితులతో చెప్పుకున్నాడట.

‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, మరియు సక్సెస్ మీట్ లోను తారకరత్న ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు.ఆయన చివరి కోరికతో పాటు, ఎంతో రాజకీయ భవిష్యత్తు ని చూడకుండా ఇలా అతి చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.ఆయన పవిత్రమైన ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి ప్రార్థన చేద్దాము.