
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషితో చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యారు. ఆయన బాటలోనే మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తోంది. చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు.. పవన్ కల్యాణ్.. ఆయన కుమారుడు రాంచరణ్.. అల్లుళ్లు అల్లు అర్జున్.. సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతూ సత్తా చాటుతున్నారు.
Also Read: బిజినెస్ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ
మెగా బ్రదర్ నాగబాబు హీరోగా.. నిర్మాతగా రాణించలేకపోయినా మెగా బ్రదర్ గా మాత్రం ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక.. కుమారుడు వరుణ్ తేజ్ సైతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగబాబు బుల్లితెరపై నెంబర్ షోగా కొనసాగుతున్న జబర్దస్త్ షోకు జడ్జిగా కొనసాగారు. ప్రస్తుతం జీ తెలుగులో ‘బొమ్మ అదిరింది’ షో చేస్తున్నారు. ఈ షోను జబర్దస్త్ కు ధీటుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు.
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిదా.. గద్దలకొండ గణేష్.. ఎఫ్-2 వంటి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నిహారిక పెళ్లి పనుల్లో బీజీగా ఉన్నాడు. మెగా డాటర్ నిహారికకు మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తొలుత షార్ట్ ఫిలీమ్స్.. యాంకరింగ్ చేసింది. తనకు తాను నిరూపించుకున్నాకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మెగా ఫ్యాన్స్ ను అలరించింది.
త్వరలోనే నిహారిక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుపెట్టబోతుంది. ఈక్రమంలోనే నాగబాబు తన కూతురుపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు. తన కూతురు ఓ ఐదు నిమిషాలు కన్పించకపోతే విలవిలలాడే నాగబాబుకు ఓ పదిరోజులపాటు దూరంగా ఉండాల్సి వచ్చినపుడు ఎలా బాధపడ్డారో తాజాగా బయటపెడుతూ ఎమోషన్ అయ్యాడు. అంతేకాకుండా పిల్లలను ఓవర్ ప్రొటెక్ట్ చేయద్దనే మెసేజ్ కూడా ఇచ్చాడు.
నిహారిక పదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ వాళ్లు ఎక్స్ కర్షన్ ప్లాన్ చేశారు. ఉత్తరాంచల్లో పదిరోజులపాటు విహారయాత్ర ఉండగా నిహారిక తాను వెళుతానంటూ నాగబాబుకు చెప్పింది. అన్నిరోజులు కూతురును వదిలి ఉండాలంటే భయంవేసి నాగబాబు పంపించను అని చెప్పారు. నిహారిక ఐదారు రోజులు బ్రతిమిలాడే సరికే నాగబాబు ఓ కండిషన్ తో ఒప్పుకున్నారు.
Also Read: పూజా హెగ్డే.. అందుకే దూరం జరుగుతుంది !
నిహారిక నీ వెంట ఇద్దరూ బాడీ గార్డ్స్‌ను పంపిస్తాను.. వాళ్లు నిన్ను దూరం నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. నిన్ను డిస్టర్బ్ చేయరు ఓకేనా అని నాగబాబు అడిగుగా నిహారిక అలా చేస్తే తన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారని… దానికి బదులు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని నిహారిక సమాధాన ఇచ్చినట్లు నాగబాబు చెప్పారు.
ఆ తర్వాతి రోజు ఉదయాన్నే నాగబాబు లేచేసరికి పక్కన ఓ లెటర్ ఉంది. అది నిహారిక రాసింది. అందులో ఇలా రాసింది. నాన్నా.. నా ఫ్రెండ్స్ నంబర్లు.. నా టీచర్ల నంబర్లన్నీ ఇస్తాను.. రోజూ మూడుసార్లు ఫోన్ చేస్తాను.. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతాను.. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా.. అంటూ క్యూట్ క్యూట్ ఫోటోలను కూడా జతచేసి చాలా చక్కగా కమ్యూనికేట్ చేసింది.
ఆ లెటర్ చూడగానే నాగబాబు కూల్ అయిపోయారు. నిహారిక విహారయాత్రకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నాగబాబు చెప్పారు. ఆ రోజు అలా నిహారిక కమ్యూనికేట్ చేయకపోతే తాను విహారయాత్ర మిస్ అయ్యేది.. నేనూ ఒప్పుకునే వాడిని కాదంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నాగబాబు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
పిల్లలకు మాట్లాడే స్వేచ్ఛ.. వారి భావాలను తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం ఇవ్వాలన్నారు. ఈరోజుల్లో తల్లిదండ్రులంతా పిల్లలను ఓవర్ ప్రొటక్ట్ చేస్తూ వారి ఫ్రీడంను హరిస్తున్నారని.. పిల్లలు ఏదైనా అడిగినా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా పంపించడం లేదన్నారు. నేను కూడా అలాగే చేసేవాడినని కానీ తన కూతురు తనను మెప్పించేలా కమ్యూనికేట్ చేయడం నచ్చుతుందని నాగబాబు తెలిపారు. నాటి సంఘటనను నాగబాబు గుర్తుచేస్తూ నిహారికతో తన బాండింగ్ ఎలా ఉంటుందో తెలియజేశాడు.