Nagababu- Actress Pakeezah Vasuki: సినిమా వందల కోట్ల వ్యాపారం. ఒక్క టాలీవుడ్లోనే ఏడాదికి రెండు వేల కోట్ల బడ్జెట్ కు సమానమైన చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కానీ ఈ టర్నోవర్ మొత్తం ఎవరికి చేరుతుందంటే హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్, కొందరు పేరున్న నటులు. సాదా సీదా నటులు, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్స్ పొందేది చాలా తక్కువ. వారి జీతాలు, రెమ్యూనరేషన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. వందల చిత్రాల్లో నటించి కూడా సొంత ఇల్లు లేని నటులు ఎందరో ఉన్నారు. దారుణమైన పరిస్థితి ఏంటంటే అనారోగ్యం బారినపడినా? అవకాశాలు తగ్గినా? వీరికి కనీస ఆర్థిక భద్రత ఉండదు.

ఒక్క టాలీవుడ్ లోనే వందల మంది సీనియర్ ఆర్టిస్ట్స్ తిండి, బట్ట, గూడు లేక అల్లాడుతున్నారు. శ్రీలక్ష్మి, రమాప్రభ, పావలా శ్యామలా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది. ఒక సినిమా తెరకెక్కించాలని హీరోనే కాదు జూనియర్ ఆర్టిస్ట్ కూడా కావాలి. కానీ రెమ్యూనరేషన్ లక్షల రెట్లు తేడా ఉంటుంది. ఈ టాపిక్ చర్చించాలంటే చాలా సమయం పడుతుంది. ఇంతటి ప్రజాదరణ ఉన్న పరిశ్రమలో కూడా నటుల జీవితాలకు భరోసా లేదు.
పాకీజా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అసెంబ్లీ రౌడీ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు. పాకీజా అసలు పేరు వాసుకీ. తమిళనాడుకు చెందిన ఆమె కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేశారు. రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన వాసికీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం తినడానికి తిండిలేదు. ఆఫర్స్ లేక సొంతూరు వెళ్ళిపోయింది. షుగర్ వ్యాధితో బాధపడుతుంది. డాక్టర్స్ ఆమె యుటెరస్ తొలగించారట. ఆమె దుర్బర పరిస్థితిని ఓ ఛానల్ వెలుగులోకి తెచ్చింది.

దీంతో నటుడు జనసేన నాయకులు నాగబాబు స్పందించారు. నాగబాబు తన సొంత డబ్బులు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం గా ప్రకటించారు. స్వయంగా వాసుకీతో మాట్లాడారు. నాగబాబు సాయానికి వాసుకీ కన్నీరు పెట్టుకున్నారు. ఎదురుగా ఉంటే ఆయనకు నమస్కరించే దాన్ని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగువారే కొంతలో కొంత తనను ఆదుకుంటున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రజినీకాంత్ నుండి ఎందరో కోలీవుడ్ ప్రముఖులకు తన గోడు వినిపించినా పట్టించుకోలేదట. కేవలం తోటి నటి అనే కారణంగా నాగబాబు ఆమెకు ఆర్థిక సహాయం చేసి కష్ట సమయంలో అండగా నిలిచారు.