https://oktelugu.com/

Naga Shaurya Marries Anusha Shetty : ఘనంగా నాగ శౌర్య వివాహం… సిగ్గుల మొగ్గలు.. నూతన జంట పెళ్లి వీడియో వైరల్!

Naga Shaurya Marries Anusha Shetty నాగ శౌర్య-అనూష శెట్టి వివాహం ఘనంగా ముగిసింది. నేడు ఉదయం 11: 25 నిమిషాలకు అనూష మెడలో నాగ శౌర్య మూడు ముళ్ళు వేశాడు. అర్థాంగితో ఏడు అడుగులు వేశాడు. వేద మంత్రాల మధ్య పెద్ద ఆశీర్వాదంతో నాగ శౌర్య-అనూష ఒక్కటయ్యారు. నాగ శౌర్య వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కలకాలం పిల్లాపాపలతో అన్యోన్యంగా జీవించాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2022 / 05:35 PM IST
    Follow us on

    Naga Shaurya Marries Anusha Shetty నాగ శౌర్య-అనూష శెట్టి వివాహం ఘనంగా ముగిసింది. నేడు ఉదయం 11: 25 నిమిషాలకు అనూష మెడలో నాగ శౌర్య మూడు ముళ్ళు వేశాడు. అర్థాంగితో ఏడు అడుగులు వేశాడు. వేద మంత్రాల మధ్య పెద్ద ఆశీర్వాదంతో నాగ శౌర్య-అనూష ఒక్కటయ్యారు. నాగ శౌర్య వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కలకాలం పిల్లాపాపలతో అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటున్నారు.

    నాగ శౌర్య సడన్ గా పెళ్లి ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి అనగా ఆయన వెడ్డింగ్ కార్డు బయటకు వచ్చింది. ఈ న్యూస్ చిత్ర వర్గాలతో పాటు అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. నవంబర్ 19న మెహందీ, 20న వివాహం అంటూ తెలియజేశారు. ఇక పెళ్లి వేదిక బెంగుళూరుగా నిర్ణయించారు. రెండు రోజుల ముందే నాగ శౌర్య కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.

    నాగ శౌర్య భార్య అనూష శెట్టి కర్ణాటకకు చెందినవారు. బెంగుళూరు కేంద్రంగా ఆమె ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. ఈ కారణంతో పెళ్లి బెంగుళూరులో జరిపారు. కాగా నాగ చైతన్య వివాహానికి పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం లేదని సమాచారం. త్వరలో హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి చిత్ర ప్రముఖులను, సన్నిహితులను ఆహ్వానించనున్నారని వినికిడి. వివాహం హైదరాబాద్ లో జరిగితే టాలీవుడ్ సెలెబ్స్ హాజరయ్యేవారు.

    కాగా నాలుగైదు రోజుల్లో పెళ్లి అనగా నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యాడు. విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న నాగ శౌర్య సెట్స్ లో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. జ్వరంతో బాధపడుతున్న నాగ శౌర్య నీరసంతో కళ్ళు తిరిగి క్రిందపడ్డారని వైద్యులు తెలిపారు. రెండు రోజులు ఆసుపత్రిలో నాగ శౌర్య చికిత్స తీసుకోవడం విశేషం.

    ఇక ఒక సాలిడ్ హిట్ కోసం నాగ శౌర్య చాలా ట్రై చేస్తున్నారు. ఎంత కష్టపడినా, ప్రయోగాలు చేసినా ఫలితం రావడం లేదు. ప్రస్తుతం ఆయన హీరోగా మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. పోలీసు వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే చిత్రాలు చేస్తున్నారు.