https://oktelugu.com/

Thank You Trailer Talk : మొదలైన ప్రేమకథ చేరే గమ్యమే ‘థ్యాంక్ యూ’

Thank You Trailer Talk : నాగచైతన్య మరో ప్రేమ కథతో ముందుకు వస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత మళ్లీ అదే పంథాలో పయనిస్తున్నాడు. లవ్ స్టోరీలతోనే సక్సెస్ సాధ్యమని అనుకుంటున్నాడు. విలక్షణ దర్శకుడు విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో తాజాగా ‘థ్యాంక్ యూ’ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ‘ట్రైలర్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 12, 2022 / 08:16 PM IST
    Follow us on

    Thank You Trailer Talk : నాగచైతన్య మరో ప్రేమ కథతో ముందుకు వస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత మళ్లీ అదే పంథాలో పయనిస్తున్నాడు. లవ్ స్టోరీలతోనే సక్సెస్ సాధ్యమని అనుకుంటున్నాడు. విలక్షణ దర్శకుడు విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో తాజాగా ‘థ్యాంక్ యూ’ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ‘ట్రైలర్’ రిలీజ్ చేశారు.

    ట్రైలర్ చూస్తే హ‌ృద్యమైన ప్రేమకథ అని తెలుస్తోంది. తన బాల్యం, యవ్వనం, సెటిల్ అయ్యాక మూడు ప్రేమకథలను తెరపై చూపించారు. ఒక పల్లెటూరిలో చదువుకునే వయసులో మాళవికతో తొలి ప్రేమను చూపించారు. అనంతరం మధ్యలో అవికా గోర్ తో ప్రేమ.. అనంతరం విదేశాల్లో రాశీఖన్నాతో మెచ్చుర్డ్ లవ్ ను చూపించారు. క్లాస్ మాస్ , ఓవర్సీస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని మూడు ప్రేమకథలను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.

    కొన్ని సీన్లు, సంభాషణలు యువ హృదయాలను ఆకట్టుకునేలా రూపొందించారు.తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా హృదయాన్ని తాకేలా ఉంది.

    నాగచైతన్య ప్రేమ ఎలా సాగింది? ముగ్గురు హీరోయిన్లలో ఎవరికి సొంతం అవుతాడన్నది తెరపై చూడాల్సిందే. ప్రతీ సీన్ ఎంతో ఆహ్లాదంగా నింపేశారు. నిర్మాత దిల్ రాజు కావడతో ఈ కథ, సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆయన సినిమా తీస్తున్నాడంటే విషయం ఉన్నట్టే లెక్క.

    ఈ సినిమా ప్రేమ కథ ప్రేక్షకులకు ఎంత మేరకు నచ్చుతుందన్నది జూన్ 23న తేలనుంది.