
Music Director Mickey J Mayer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వాటిల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి.టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మహానటి ఫేమ్ ‘నాగ అశ్విన్’ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్స్ అభిమానుల్లో ఈ సినిమా పై మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ఈమధ్యనే అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త అభిమానులను కంగారు పెడుతుంది,అదేంటో ఇప్పుడు చూద్దాము.
ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు ఆయన ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు నిర్మాత అశ్వినీ దత్ ఈ సందర్భంగా తెలిపాడు.మిక్కీ అందించిన సంగీతం ఎందుకో ఈ సినిమా థీమ్ కి సూట్ అవ్వట్లేదని,ఆయన ఇచ్చిన ట్యూన్స్ కూడా ఆకట్టుకునేలా లేదని, అందుకే అతనిని తప్పించి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ని తీసుకుంటున్నామని, అతనితో పాటుగా మరో ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా పెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపాడు.

దీనితో ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది.ఎందుకంటే మిక్కీ జె మేయర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, గతం లో ఆయన ఇదే బ్యానర్ లో మహానటి అనే సినిమా చేసాడు.ఇందులో ఆయన ఇచ్చిన మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లి క్లాసిక్ అనే ఫీలింగ్ ని కలుగచేసింది,అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసేసి హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకున్నారు, ఔట్పుట్ లో ఏమైనా తేడా వస్తుందేమో అని భయపడుతున్నారు.