Mlc Election AP : ఉత్తరాంధ్రలో హోరాహోరీ పోరు..!

– నలుగురు మధ్య తీవ్రంగా పోటీ.. విజయంపై ఎవరి ధీమా వారిదే MLC election  అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది. అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఝలక్ ఇవ్వనున్నారా..? సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపి నిలబెట్టుకుంటుందా..? టిడిపి ఎన్నికల్లో సత్తా చాటుతుందా..? పిడిఎఫ్ అభ్యర్థి విజేకేతనం ఎగురవేస్తుందా..? అసలీ ఎన్నికల్లో ఎవరిని విజయం వరించనుందో తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఎన్నిక జరిగింది. జిల్లాల పరిధిలోని […]

Written By: NARESH, Updated On : March 14, 2023 1:00 pm
Follow us on

– నలుగురు మధ్య తీవ్రంగా పోటీ.. విజయంపై ఎవరి ధీమా వారిదే

MLC election  అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది. అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఝలక్ ఇవ్వనున్నారా..? సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బిజెపి నిలబెట్టుకుంటుందా..? టిడిపి ఎన్నికల్లో సత్తా చాటుతుందా..? పిడిఎఫ్ అభ్యర్థి విజేకేతనం ఎగురవేస్తుందా..? అసలీ ఎన్నికల్లో ఎవరిని విజయం వరించనుందో తెలుసుకుందాం.

ఉత్తరాంధ్రలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఎన్నిక జరిగింది. జిల్లాల పరిధిలోని 331 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరిగింది. ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల్లో 2,89,214 మంది పట్టభద్రులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ.. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 59.77% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ప్రతిష్టాత్మకంగా భావించిన పార్టీలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఆరు జిల్లాలోని ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు గత నెల రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బిజెపి గట్టిగానే కృషి చేసింది. అలాగే పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ నలుగురు మధ్య పోటీ నెలకొంది. అధికార వైసిపి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకునేందుకు సర్వశక్తులను ఒడ్డింది. ఎమ్మెల్సీ స్థానం సాధించేందుకు అనుగుణంగా ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యుడు వై వి సుబ్బారెడ్డి తో పాటు, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీ విజయ బాధ్యతలను పార్టీ అప్పగించింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్ గానే భావించి గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డింది. ముందుగా అనుకున్న పార్టీ అభ్యర్థిని తప్పించి ఎకానమీ ఫ్యాకల్టీగా ఈ ప్రాంతంలో పేరుగాంచిన వేపాడ చిరంజీవిరావును బరిలో దించడం ద్వారా ఎన్నికపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించిన విధానాన్ని తెలియజేసింది. అదేవిధంగా బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగానే కృషి చేసింది. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ ప్రాంతానికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు వంటి వాటి గురించి తెలియజేస్తూ మాధవ పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించారు. అదేవిధంగా బిజెపికి క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్, సంఘ్ తో పాటు పలు బిజెపి అనుబంధ సంస్థలు మాధవ్ కోసం కృషి చేశాయి. అలాగే పిడిఎఫ్ అభ్యర్థి గా బరిలో నిలిచిన కోరట్ల రమాప్రభ విజయం కోసం విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు గట్టిగానే కృషి చేశాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి నెలకొంది. పోటీ గట్టిగానే సాగడంతో ఎవరు గెలుస్తారు అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇకపోతే నలుగురు అభ్యర్థులు విజయం పై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరిగిన సరళి, నెలకొన్న పోటీని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటులో అభ్యర్థి విజయం తేలకపోవచ్చు అని, రెండో ప్రాధాన్యత ఓటు వరకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.