https://oktelugu.com/

Tiruchi : చితి నుంచి లేచి ఏడుస్తున్న కూతురు చేయి పట్టుకున్న వృద్ధురాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అనారోగ్యంతో మృతి చెందింది ఓ ముసలావిడ. ఈమెను స్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆమె మరణ వార్త తెలిసి చుట్టాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు వచ్చి చివరి సారి ఆమెను చూసి అందరూ ఏడుస్తున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 11:54 AM IST

    Tiruchi

    Follow us on

    Tiruchi :  చనిపోయిన వారు బతకడం అసంభవం కదా. ఇలాంటి వార్తలు విన్నా కూడా నమ్మడం అసంభవమే. శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను కనుగొన్నారు కానీ. మనిషిని పుట్టించడం, చావును ఆపడంలో మాత్రం విఫలం అవుతునే ఉన్నారు. చనిపోయిన వ్యక్తిని బతికించేలా కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పటికీ సాధ్యం కాలేదనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే చనిపోయిన ఓ ముసలావిడ బతికింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం ఇంతకీ ఆ విషయం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి.

    అనారోగ్యంతో మృతి చెందింది ఓ ముసలావిడ. ఈమెను స్మశానంలో దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆమె మరణ వార్త తెలిసి చుట్టాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు వచ్చి చివరి సారి ఆమెను చూసి అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడే వదిలివెళ్లావా? మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా అంటూ దు:ఖంలో మునిగితేలిన వారికి ఓ అద్భుతం కనిపించింది. వీరి ఏడుపులకు దేవుడు కనికరించాడో లేదా ఆమెనే ఆ యముడితో గొడవ పడి మరీ తిరిగి భూమి మీదకు వచ్చిందో కానీ చితి మీద లేచి కూర్చుంది.

    అక్కడి వరకు బాగానే ఉన్న వచ్చిన జనాలకు మాత్రం ఫుల్ భయం అయిందట. ఆమె మరణించింది కదా. ఎప్పటి నుంచో వివిధ కార్యక్రమాలు చేస్తున్న కూడా లేవలేదు. ఇప్పుడు సడన్ గా లేచి కూర్చొంది ఏంటి? దయ్యంగా మారిందా అంటూ వారి మెదడులో ఎన్నో ప్రశ్నలు వచ్చాయట. అందుకే ముందు ఆమె వద్దకు వెళ్లాలంటే ఆలోచించారట. కానీ ఆమె బతికే ఉందని తెలిసి, దయ్యం కాదని నిర్ధారించుకొని తిరిగి హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది.

    తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామంలో పంపైయ్యన్‌ (72), అతని భార్య చిన్నమ్మాల్‌ (62) దంపతులు నివసిస్తున్నారు. ఈ వృద్ధుల మధ్య ఏం జరిగిందో ఎలాంటి సమస్య వచ్చిందో తెలియదు కానీ నవంబర్‌ 16న చిన్నమ్మాల్‌ పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొని వచ్చారు కుటుంబ సభ్యులు. చిన్నమ్మాల్‌ మార్గ మధ్యలోనే మరణించిందట. దీంతో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఎమ్‌ మెట్టుపట్టిలోని స్మశాన వాటికలో చిన్నమ్మాల్‌ దహన సంస్కారాలకు ఎంతో మంది బంధువులు, ఊరి జనం వచ్చారు.

    చితి మీద ఆమె శవాన్ని పెట్టి కాల్చే సమయంలో ఆమె శరీరం నుంచి కదలికలు వచ్చాయట. అనంతరం ఆమె కళ్లు తెరచింది. అంతేకాదు సడన్ గా ఆమె మీద పడి ఏడుస్తున్న బంధువుల్లో ఒకరి చెయ్యి పట్టుకుంది. వెంటనే తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. ఈమె ఒకరి చేయి పట్టుకోవడంతో మిగిలిన వారందరూ భయంతో చచ్చారనుకోండి. ఆ తర్వాత ఆమె బతికే ఉందని తెలుసుకున్నారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను చికిత్స కోసం తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (MGMGH) కు తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై కేసు మాత్రం నమోదు చేయలేదట.