
KTR Tweet On Governor: తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై ఎప్పకప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఆసక్తికర అంశాలతోపాటు రాజకీయ అంశాలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తీరుపై సంచనల ట్వీట్ చేశారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టడమేనా సమాఖ్య స్ఫూర్తి అంటే అని తమిళనాడు గవర్నర్‌పై అక్కడి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
గవర్నర్ల తీరును తప్పుపడుతూ..
గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షత స్పష్టంగా కనిపిస్తుంది. దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా ఇదేనా? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా?’ అంటూ విమర్శలు చేశారు. కాగా తమిళనాడు గవర్నర్ బిల్లుల ను క్లియర్ చేయడం లేదని గవర్నర్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోనూ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది. తెలంగాణ గవర్నర్ కూడా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై పేరు ప్రస్తావించకపోయినా.. గవర్నర్ల వ్యవస్థను ప్రశ్నించేలా పరోక్షంగా తెలంగాణ గవర్నర్‌ను హెచ్చరించేలా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

పెండింగ్ బిల్లులు ఇవే..
గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదం పొందాయి. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉభయసభల్లో ఆమోదం పొంది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లుల్లో మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. మరో రెండు బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. ఇక మరో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పంపించారు. 3 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.